ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా(INDIA VS AUSTRALIA) వరల్డ్ కప్(world cup) ఫైట్‌కి యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. వరల్డ్‌కప్‌లో భాగంగా ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు జరగగా.. రెండు వన్ సైడ్ మ్యాచ్‌లుగానే ముగిశాయి. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ నిర్దేశించిన 283 పరుగుల టార్గెట్‌ని ఊఫ్ అని ఊదిపడేసింది న్యూజిలాండ్.. ఒక్కటంటే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి టార్గెట్‌ని రీచ్ అయ్యింది. ఇక రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై 81 పరుగుల తేడాతో గెలిచింది పాకిస్థాన్. ఇక రేపు(అక్టోబర్ 7) రెండు మ్యాచ్‌లున్నాయి. బంగ్లాదేశ్ వర్సెస్ అఫ్ఘానిస్తాన్ మ్యాచ్‌తో పాటు సౌతాఫ్రికా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ ఉంది. ఇక ఎల్లుండి ఆదివారం అదిరిపోయే మ్యాచ్ ఉంది. చెన్నై వేదికగా ఇండియా-ఆస్ట్రేలియా తలపడనున్నాయి.
అశ్విన్‌తో ఆస్ట్రేలియాకు కంగారే:
కంగారులు తెగ కంగారు పడుతున్నారు. దానికి కారణం అశ్విన్(ashwin). గత ఆరేళ్లలో కేవలం నాలగు వన్డేలే ఆడిన అశ్విన్‌ని గాయపడిన అక్షర్ పటేల్ స్థానంలో సెలక్ట్ చేసింది బీసీసీఐ. అయితే అశ్విన్ టెస్టుల్లో నంబర్ వన్ బౌలర్. టీమిండియాకు తిరుగులేని విజయాలు అందించిన స్పిన్నర్ అతను. వన్డేలు ఆడలేదు కదా అని అంత తెలిగ్గా అంచనా వేయలేం. ఆస్ట్రేలియాకు ఈ విషయం తెలుసు. టెస్టుల్లో ముప్పుతిప్పలు పెట్టే అశ్విన్‌ని లైట్ తీసుకునే పరిస్థితిలో లేదు ఆస్ట్రేలియా. దీనికి మరో ముఖ్యమైన కారణం కూడా ఉంది. మ్యాచ్ చెన్నైలో జరుగుతుండడం ఆస్ట్రేలియాను మరింత టెన్షన్ పడుతుంది. అశ్విన్‌కు చెన్నై హౌం గ్రౌండ్ కూడా.
ముగ్గురు స్పిన్నర్లు ఫిక్సా?
చెన్నై స్పిన్ ట్రాక్ కావడంతో ఆస్ట్రేలియాపై టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే పేసర్ షమి బెంచ్‌కి పరిమితం కావాల్సి ఉంటుంది. అశ్విన్‌తో పాటు కుల్దీప్, జడేజా తుది జట్టులో ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నెట్స్‌లో అశ్విన్ బౌలింగ్ వేస్తున్న వీడియోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పరిస్థితులను గమనిస్తే ఆస్ట్రేలియాపై మ్యాచ్‌లో అశ్విన్‌తో తొలి ఓవర్ వేయించే ఛాన్స్ కనిపిస్తోంది. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్ వార్నర్‌పై అశ్విన్‌ని అదిరిపోయే రికార్డు ఉంది. గతంలో వార్నర్‌ని అశ్విన్ చాలాసార్లు ఇబ్బంది పెట్టాడు. ఏకంగా 11సార్లు అవుట్ చేశాడు. అటు టెస్టుల్లో స్మిత్ కూడా అశ్విన్ దెబ్బకు అనేకసార్లు బోల్తా పడ్డాడు. అందుకే అశ్విన్‌తో మొదట బౌలింగ్ వేయించి ఈ ఇద్దరి భరతం పట్టాలని టీమిండియా భావిస్తున్నట్టు ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
ALSO READ: నాడు తండ్రి.. నేడు కొడుకు.. సచిన్, రిజ్వాన్‌లను బోల్తా కొట్టించిన తండ్రీకొడుకులు!