Ind Vs Aus: ఆ కీలక ప్లేయర్‌ లేకుండానే బరిలోకి టీమిండియా.. ఫస్ట్‌ బ్యాటింగ్‌ ఎవరిదంటే?

అందరూ ఎదురుచూస్తున్న మ్యాచ్‌ రానే వచ్చింది. టీమిండియా ఆస్ట్రేలియా మ్యాచ్‌కు టాస్‌ పడింది. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఊహించినట్టుగానే గిల్‌ లేకుండానే టీమిండియా బరిలోకి దిగుతోంది. డెంగీతో బాధపడుతున్న గిల్‌ ఈ మ్యాచ్‌లో ఆడడంలేదు. అతను ఇంకా కోలుకోలేదు.. అటు ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా ఆడనుంది.

New Update
Ind Vs Aus: ఆ కీలక ప్లేయర్‌ లేకుండానే బరిలోకి టీమిండియా.. ఫస్ట్‌ బ్యాటింగ్‌ ఎవరిదంటే?

అందరూ ఎదురుచూస్తున్న మ్యాచ్‌ రానే వచ్చింది. టీమిండియా ఆస్ట్రేలియా మ్యాచ్‌కు టాస్‌ పడింది. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఊహించినట్టుగానే గిల్‌ లేకుండానే టీమిండియా బరిలోకి దిగుతోంది. డెంగీతో బాధపడుతున్న గిల్‌ ఈ మ్యాచ్‌లో ఆడడంలేదు. అతను ఇంకా కోలుకోలేదు.. అటు ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా ఆడనుంది.

ఎవరు గెలుస్తారో?
ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్‌ చేస్తుండగా.. వార్నర్‌, మార్ష్ ఓపెనర్లగా బరిలోది దిగనున్నారు. స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌తో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ లైన్‌ అప్ యమ స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. అటు బైలింగ్‌లోనూ హేజిల్‌వుడ్‌, కెప్టెన్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌ ముగ్గురు కూడా మ్యాచ్‌ విన్నర్లే. ఇక స్పిన్నర్‌ జంపా తనదైన రోజున మ్యాచ్‌ను మలుపు తిప్పగల ప్లేయర్‌. అయితే ఇటివలి కాలంలో జంపా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌ జరుగుతుంది చెన్నైలో కావడంతో స్పిన్నర్లకు అడ్వేంటేజ్‌గా ఉంటుంది. జంపా బంతులను సరిగ్గా అంచనా వేయకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అందులోనూ ఈ మధ్య టీమిండియా బ్యాటర్లు స్పిన్నర్లను ఆడడంలో తడబడుతున్నారు.

ఇండియాదే పైచేయి?
మరోవైపు టీమిండియా గిల్‌ లేకుండా ఆడుతోంది. ఈ ఏడాది సొంతగడ్డపై అద్భుత ఫామ్‌లో ఉన్నాడు గిల్‌. అతని స్థానంలో ఇషాన్‌ తుది జట్టులోకి వచ్చాడు. రోహిత్‌తో ఇషాన్‌ ఓపెనింగ్‌ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే రాహుల్‌, రోహిత్‌ ఓపెనింగ్‌ చేసే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం. గతంలో ఈ ఇద్దరూ భారత్‌ జట్టుకు కలిసి ఓపెనింగ్‌ చేసినవారే. ఒకవేళ రాహుల్‌ ఓపెనింగ్‌ దిగితే ఇషాన్‌ నంబర్‌-5 పొజిషన్‌లో ఆడాల్సి ఉంటుంది. ఇటివలి నంబర్‌-5 పొజిషన్‌లో బ్యాటింగ్‌ చేసిన ఇషాన్‌ ఒక మ్యాచ్‌లో 81 రన్స్ చేశాడు. అటు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్‌తో ఆస్ట్రేలియాను స్పిన్‌తో చుట్టేయలని టీమిండియా భావిస్తోంది. చెన్నై పిచ్‌ కావడంతో ముగ్గురు స్పిన్నర్లను బరిలోకి దింపుతోంది. వార్నర్‌ని మరోసారి అశ్విన్‌ ఆటకట్టించే అవకాశం కనిపిస్తోంది. ఇక స్మిత్‌పై జడేజా మరోసారి పైచేయి సాధిస్తాడా అన్నది చూడాల్సి ఉంది.

తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, గ్లెన్ మ్యాక్స్వెల్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్వుడ్, ఆడమ్ జంపా

ALSO READ: హైదరాబాద్‌ స్టేడియం సీట్లలో పక్షుల రెట్టలు.. 2 వేలు ఖర్చు పెట్టి వీటిపై కూర్చోవాలా?

Advertisment
తాజా కథనాలు