A Dhawan-less ODI World Cup! : పెద్ద టోర్నిల్లో టీమిండియాకు కొండంత అండ టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్(Shikar Dhawan). ఒకప్పుడు టీమిండియాకు ఓపెనర్‌గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ధావన్ ప్రస్తుతం టీమ్ నుంచి వేటుకు గురయ్యాడు. చాలా కాలంగా ధావన్ లేకుండానే ఇండియా మ్యాచ్‌లు ఆడుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్‌లో అనేక రికార్డులు సృష్టించిన ధావన్ ఈ మెగా టోర్నికి దూరంకావడం అభిమానులను బాధ పెడుతోంది. ఎవరూ ఔనన్నా కాదన్నా పెద్ద టోర్నమెంట్లలో ధావన్ ఆట తీరు అద్భుతం. మిగిలిన మ్యాచ్‌ల్లో ధావన్ ఎలా ఆడుతాడదన్నది పక్కన పెడితే బిగ్ మ్యాచ్‌లో మాత్రం టీమిండియా తోపు అతనే.
మ్యాన్ ఆఫ్ బిగ్ మ్యాచస్:
ఇప్పటివరకు ఆడిన పది ప్రపంచకప్ మ్యాచుల్లో ధావన్ మూడు సెంచరీలతో 53 సగటుతో 537 పరుగులు చేశాడు. కేవలం రెండు మ్యాచ్ల తర్వాత 2019 ఎడిషన్ నుంచి నిష్క్రమించిన ఈ స్టార్ ప్లేయర్..ఆస్ట్రేలియాపై మ్యాచ్ విన్నింగ్ సెంచరీతో మరోసారి టీమ్‌లోకి దూసుకొచ్చాడు వచ్చాడు. రెండు సార్లు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అందుకున్న ఘనత ధానవ్‌ది. 2010లో వన్డేల్లో అరంగేట్రం చేసిన ధావన్ తక్కువ టైమ్‌లోనే టీమిండియాలో ప్రధాన ప్లేయర్‌గా మారిపోయాడు. 2013 మార్చిలో ఆస్ట్రేలియాపై టెస్టుల్లో అరంగేట్రం చేసిన ధావన్ మిచెల్ స్టార్క్, పీటర్ సిడిల్, నాథన్ లియాన్, జేవియర్ డోహెర్టీలతో కూడిన జట్టుపై 174 బంతుల్లోనే 187 రన్స్ చేశాడు. ఇందులో 33 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. మొహాలీలో భారత్‌ను ఆరు వికెట్ల తేడాతో గెలిపించాడు.
కట్ చేస్తే..:
2015 వరల్డ్‌కప్‌లో ధావన్ ఎలాంటి మ్యాచ్ విన్నరో ప్రపంచానికి తెలిసి వచ్చింది. 2019వరకు బిగ్ మ్యాచ్‌లో సత్తా చాటాలంటే ధావన్ వల్లే సాధ్యమనే భావన అభిమానుల్లో ముద్ర పడిపోయింది. అయితే తర్వాత క్రమంగా ఫామ్ కోల్పోయిన ధావన్ టీమ్‌లో స్థానం కోల్పోయాడు. నిజానికి ధావన్ కంటే ఎక్కువగా ఫెయిల్ అయిన ఆటగాళ్లకి సెలక్టర్లు ఎక్కువ ఛాన్సులు ఇచ్చారు. కానీ ధావన్‌ని మాత్రం బలిపశువును చేశారు. 2022 డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో చివరిసారిగా భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ధావన్ తర్వాత వన్డే మ్యాచ్‌లు ఆడలేదు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రాణించలేకపోయాడు, మొత్తం 18 పరుగులు చేయగలిగాడు. యువ ఆటగాడు శుభ్‌మాన్ గిల్ అదే టైమ్‌లో లైమ్‌లైట్‌లోకి రావడం ధావన్ ఛాన్సులను దెబ్బకొట్టింది. ప్రస్తుతం గిల్ తన కెరీర్‌లోనే టాప్ ఫామ్‌లో ఉన్నాడు. గిల్ తొమ్మిది గేమ్‌ల్లో 624 పరుగులను తన పేరుకు జోడించాడు 78 అద్భుతమైన సగటును కలిగి ఉన్నాడు. అసాధారణమైన స్ట్రైక్ రేట్ 117.5తో బ్యాటింగ్ చేస్తున్నాడు. అటు
ధావన్ ఫామ్ పూర్తిగా పోయింది. చివరి 22 వన్డేల్లో కేవలం 688 పరుగులే చేశాడు. స్ట్రైక్ రేట్ రెండేళ్ల క్రితం 93 ఉండగా.. ఇప్పుడు 75కి పడిపోయింది. అందుకే గిల్‌తోనే రోహిత్ శర్మ ఈ ప్రపంచ కప్‌కి ఓపెనింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో 37ఏళ్ల ధావన్ వరల్డ్ కప్ కెరీర్ ముగిసినట్టే చెప్పాలి.
ALSO READ: మూర్ఖుడు’, ‘అనర్హుడు..’ ఆ పిచ్‌లపై ఎవడైనా వికెట్లు తీస్తాడు..ఇదేం తిట్టుడు భయ్యా!