వరల్డ్‌కప్(World cup) అంటే మాములుగా ఉండదు మరి.. ఇండియాలో క్రికెట్ మతమైతే వరల్డ్‌కప్ ఒక పండుగ. ప్రపంచ కప్ వచ్చిందంటే క్రికెట్ ఫీవర్ థర్మోమీటర్ బ్లాస్ట్ అయ్యేలాగా ఉంటుంది. అందులోనూ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ లెవల్ పీక్ స్టేజీకి వెళ్తుంది. ఇక ఇంట్లో ఫ్యామిలీతోనో, ఫ్రెండ్స్‌తోనో మ్యాచ్ చూస్తు ఉంటే ఉండే కిక్కు అంతాఇంతా కాదు. పక్కన స్నేక్స్ పెట్టుకోని, డిసెంట్ సౌండ్ పెట్టుకోని, డోర్స్ క్లోజ్ చేసి, లైట్స్ ఆఫ్ చేసి, ఒక కూల్ డ్రింక్‌తో మ్యాచ్‌ని ఎంజాయ్ చేస్తే ఉంటుంది మజా మములుగా కాదు. అదే కొత్త టీవీ(TV)లో చూస్తే ఇంకా స్వర్గంతో తేలిపోతున్నట్టు ఉంటుంది. అందుకే వరల్డ్ కప్‌సీజన్ వేళ టీవీ సేల్స్ అమాంతం పెరిగాయి.
పెద్ద స్క్రీన్ టీవీల కోసం:
ఇక ఇటివలి పెద్ద స్క్రీన్ టీవీల సేల్స్ పెరిగినట్టు కంపెనీలు చెబుతున్నాయి. 55 అంగుళాలు అంతకంటే ఎక్కువ టీవీల అమ్మకాలు గత సంవత్సరం ఇదే సమయంలో విక్రయించిన దానికంటే 2-2.5 రెట్లు ఎక్కువ పెరిగినట్టు ఎల్జి ఇండియా బిజినెస్ హెడ్ (హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్) గిరీసన్ గోపి చెప్పారు. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్ సీనియర్ వీపీ మోహన్ దీప్ సింగ్ మాట్లాడుతూ పెద్ద స్క్రీన్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడిందని చెప్పారు. గత ఏడాది ఇదే కాలంలో విక్రయించిన అమ్మకాలతో పోలిస్తే దాదాపు 2.7 రెట్ల ఎక్కువ సేల్స్ జరిగినట్టు తెలిపారు. పరిస్థితి ఇలానే కొనసాగితే నవంబర్ మధ్య నాటికి స్టాక్స్ కూడా అయిపోవచ్చట.
అటు పానాసోనిక్ మార్కెటింగ్ ఇండియా ఎండీ ఫుమియాసు ఫుజిమోరి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. 55 అంగుళాల క్యాటగిరిలో తమ సేల్స్ 45శాతం పెరిగినట్టు చెప్పారు. అటు ఇన్‌స్టెంట్ ఇన్‌స్టాలేషన్ కావాలని అడుగుతున్న వారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. చాలా మంది టీవీ కొన్న తర్వాత కాస్త లేట్‌గానైనా పర్లేదులేనని ఇన్‌స్టాలేషన్ విషయంలో కాస్త మెతక వైఖరి పాటిస్తుంటారు. కంపెనీలు ఎక్కువగా లేట్ చేస్తే కానీ కోపడ్డరు. అయితే ఇప్పుడు మాత్రం ఇన్‌స్టెంట్ ఇన్‌స్టాలేషన్ ఉంటేనే కొంటామని చెబుతున్నారట. లేకపోతే ఏ షాప్‌లో స్పాట్ ఇన్‌స్టెలేషన్ ఉంటుందో అక్కడే టీవీ కొంటామని తెగెసి చెబుతున్నారట.. అట్లుంటుంది మరి ఇండియాలో క్రికెట్ పిచ్చి అంటే.
ALSO READ: క్రికెట్ చూడడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా? ఎవరైనా అడిగితే ఈ విషయాలు చెప్పండి!