IND Vs PAK: అక్తర్‌కి గట్టిగా ఇచ్చిపడేసిన సచిన్, సెహ్వాగ్‌.. ఈ కౌంటర్ చూస్తే నవ్వు ఆపుకోలేరు భయ్యా!

ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌ హైవోల్టేజ్‌ ఫైట్‌లో రోహిత్‌ సేన ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యాచ్‌కు ముందు, మ్యాచ్‌ సమయంలో పాక్‌ మాజీ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ వేసిన సెటైరికల్‌ ట్వీట్లకు భారత్‌ మాజీ లెజెండ్లు సచిన్‌, సెహ్వాగ్‌ తమదైన శైలీలో కౌంటర్లు ఇచ్చారు. పాక్‌ క్రికెటర్లకు ఫాఫ్డా జిలేబీ కనిపించిందని అందుకే 155/2 నుంచి 191కి ఆలౌట్ అయ్యే స్టేజీకి వచ్చారంటూ వేసిన కౌంటర్‌ ట్వీట్లు నెట్టింట్లో వైరల్‌గా మారింది.

IND Vs PAK: అక్తర్‌కి గట్టిగా ఇచ్చిపడేసిన సచిన్, సెహ్వాగ్‌.. ఈ కౌంటర్ చూస్తే నవ్వు ఆపుకోలేరు భయ్యా!
New Update

హై వోల్టేజ్‌ ఇండియా(India) వర్సెస్ పాకిస్థాన్‌(Pakistan) మ్యాచ్‌ ముగిసింది. ఎప్పటిలాగే వరల్డ్‌కప్‌లో పాక్‌పై ఇండియాదే విక్టరీ. కెప్టెన్ రోహిత్ శర్మ రఫ్ఫాడించాడు. సిక్సర్లతో దుమ్మురేపాడు. మ్యాచ్‌ను కోట్లాది మంది వీక్షించారు. హాట్‌ స్టార్(Hotstar) కి ఫుల్‌ వ్యూయర్‌ షిప్‌ వచ్చి పడింది. సాధారణ అభిమానుల్లాగే మాజీ క్రికెటర్లు సైతం మ్యాచ్‌ని ఎంజాయ్ చేశారు. మ్యాచ్‌కు ముందు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కొంతమంది సెటైర్ల వేసుకోగా.. మరికొంత మంది ఎమోషనల్‌ ఫీల్ అయ్యారు. పాక్‌ మాజీ ఫాస్ట్ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌(Shoaib akthar) మ్యాచ్‌కు ముందు సచిన్‌(Sachin)ని ట్రోల్ చేసేలా పోస్టు పెట్టాడు. సచిన్‌ మొదట ఏం మాట్లాడుకుండా సైలెంట్‌గా ఉన్నాడు. క్రికెట్‌లో ఎలా పర్‌ఫెక్ట్ టైమింగ్‌తో బ్యాటింగ్‌ చేస్తాడో ఇక్కడ కూడా టైమ్‌ కూడా వెయిట్ చేశాడు. ఇండియా మ్యాచ్‌ గెలవగానే ఇచ్చిపడేశాడు.


అక్తర్ ఏం అన్నాడు?
1999లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్‌ను ఔట్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ షోయబ్ ఒక ట్వీట్‌ను పోస్ట్ చేశాడు. 'కల్ అగర్ ఆసా కుచ్ కెర్నా హై, తో # థాండ్‌రాఖ్' అని అక్తర్ తన ట్విట్టర్‌లో క్యాప్షన్ రాశాడు. సచిన్‌ని అవుట్ చేసిన ఫొటో అది. సచిన్‌ అవుటైన తర్వాత తాను సంబరాలు చేసుకుంటున్న ఫొటో పెట్టి వెక్కిరించినట్టు పోస్టు పెట్టాడు. అయితే నిన్నటి మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఏడు వికెట్ల భారీ విజయాన్ని నమోదు చేయడంతో షోయబ్ అక్తర్‌ను సచిన్ ట్రోల్ చేశాడు. అక్తర్‌ పెట్టిన ట్వీట్‌ని రీట్వీట్ చేస్తూ రిప్లై ఇచ్చాడు. 'నా మిత్రమా, మీ సలహాను అనుసరించండి కియా ఔర్ సబ్ కుచ్ బిల్‌కూల్ థాండా రాఖా....' అని రిప్లై పెట్టడంతో నెటిజన్లు నవ్వుకున్నారు.

నిజానికి ఇదంతా ఫన్నిగా జరిగిన కాన్వోనే. అక్తర్‌, సచిన్‌ మైదానంలో అది పెద్ద రైవల్స్‌. ఒక్కొసారి ఒక్కరిది గ్రౌండ్‌లో డామినేషన్‌. ఇద్దరికి ఇద్దరే. 2003 ప్రపంచకప్‌లో మాత్రం అక్తర్‌ని పూర్తిగా ఉతికి ఆరేశాడు ఈ క్రికెట్ గాడ్. గ్రౌండ్‌ ఎంత పెద్ద రైవల్స్‌ అయినా కానీ బయట మాత్రం ఈ ఇద్దరు మంచి స్నేహితులు. అటు అక్తర్‌కు టీమిండియా మాజీ ఓపెనర్‌, డాషింగ్‌ క్రికెటర్‌ సెహ్వాగ్‌ సైతం గట్టి కౌంటర్లు వేశాడు. పాకిస్థాన్‌ బ్యాటింగ్‌ సమయంలో మొదట నిలకడగానే ఆడింది. వరుస పెట్టి బౌండరీలు బాదుతూ కనిపించింది. అదే సమయంలో 'వాహ్ రే.. ఈ సైలెంట్ ఫోర్లు' అంటూ అక్తర్‌ ట్వీట్ చేశాడు. ఇక పాకిస్థాన్‌ ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోవడంతో సెహ్వాగ్ సెటైర్లు వేయడం మొదలు పెట్టాడు. 'బహుశా ఈ సైలెంట్ ఫోర్లు చూసి చూసి పాకిస్థాన్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టాలని నిర్ణయించుకున్నట్లున్నారు. ఒత్తిడి తట్టుకోలేకపోయారు. హా హా.. ఫర్వాలేదు షోయబ్ భాయ్. 8-0 ఓటమిలో ఉన్న మజా ప్రేమలోనూ ఉండదు' అంటూ సెహ్వాగ్‌ అక్తర్‌కు ట్వీట్ చేశాడు అంతటితో ఆగలేదు. 'ఫాఫ్డా జిలేబీ కనిపించింది. అందుకే 191 ఆలౌట్. మనది అతి పెద్ద ప్రజాస్వామ్యం. అందుకే అందరికీ 2-2-2-2-2 వికెట్లు దక్కాయి' అంటూ పరోక్షంగా పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యం లేదంటూ తనదైన శైలీలో కౌంటర్లు వేశాడు వీరూ భాయ్‌.

ALSO READ:  రికార్డుల ఊచకోత.. వారికి గట్టిగా ఇచ్చిపడేసిన హిట్‌మ్యాన్‌..!

ALSO READ: సచిన్.. సచిన్..! టీమిండియా అభిమానుల కళ్లలో కన్నీళ్లు..ఆ రోజును మర్చిపోగలమా బాసూ!

#india-vs-pakistan #icc-world-cup-2023
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe