IND VS PAK: ఆస్ట్రేలియాను చీల్చిచెండాడిన స్ట్రాటజీతోనే బరిలోకి.. పాక్‌తో మ్యాచ్‌కు టీమిండియా తుది జట్టు ఇదే! రేపు(అక్టోబర్ 14) పాకిస్థాన్‌తో జరిగనున్న వరల్డ్‌కప్ మ్యాచ్‌కు టీమిండియా తుది జట్టు అంచనా ఇదే. టీమిండియా తుది జట్లు(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, బుమ్రా By Trinath 13 Oct 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి వరల్డ్‌కప్(World cup)లో రసవత్తర సమరానికి సమయం దగ్గర పడుతోంది. రేపు(అక్టోబర్ 14) పాకిస్థాన్(Pakistan)తో టీమిండియా తలపడనుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. మోదీ స్టేడియంలో ప్రపంచంలోనే సీటింగ్ కెపాసిటీ విషయంలో అతి పెద్ద స్టేడియం. లక్షల మంది అభిమానుల మధ్య టీమిండియా పాక్‌పై ఆడనుంది. ఇటు టీవీలకు ఎలాగో అభిమానులు అతుక్కుపోవడం ఖాయం. ఇండియా-పాక్ మ్యాచ్‌కి ఉండే హైప్, క్రేజ్ మరే ఇతర ఏ జట్లు ఆడినా ఉండవు. అందులోనూ వరల్డ్‌కప్ కావడంలో ఇప్పటికే మ్యాచ్ ఫీవర్ పీక్స్‌కి వెళ్లింది. ఇక రేపటి మ్యాచ్‌కి టీమిండియా తుది జట్టు అంచనాపై ఓ లుక్కేయండి! గిల్ ఇన్..: డెంగీని తన్నితరిమేసిన యువ ఓపెనర్ గిల్ రేపటి మ్యాచ్‌కు 99శాతం అందుబాటులో ఉంటాడని కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. దీంతో గత రెండు మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఇషాన్ కిషన్ రేపటి మ్యాచ్‌కు నాలుగో లేదా ఐదో స్థానంలో బరిలోకి దిగుతాడని సమాచారం. అంటే ఆస్ట్రేలియాపై మ్యాచ్‌లో నిర్లక్ష్యపు షాట్ ఆడి అవుటైన శ్రేయర్ అయ్యర్‌ని పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయి. గిల్ తుది జట్టులోకి వస్తే ఎప్పటిలాగే రోహిత్‌తో కలిసి ఓపెనింగ్ దిగుతాడు. ఇక వన్ డౌన్ స్పెషాలిస్ట్ బ్యాటర్, టీమిండియా ఛేజ్ కింగ్ కోహ్లీ తన స్థానంలో దుమ్మురేపేందుకు రెడీ అవుతున్నాడు. ఇక నాలుగో నంబర్‌లో రాహుల్ బ్యాటింగ్‌కి వచ్చే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత ఇషాన్‌కిషన్, పాండ్యా రానున్నారు. అదే ఫార్ములానా? ఆస్ట్రేలియాపై మ్యాచ్‌లో టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్‌తో పాక్ బ్యాటర్లకు చెక్ పెట్టేందుకు రోహిత్ స్కెచ్ వేసినట్టుగా తెలుస్తోంది. అఫ్ఘాన్‌పై మ్యాచ్‌లో అశ్విన్‌కి రెస్ట్ ఇచ్చి శార్దుల్‌ని తీసుకున్నారు. అయితే స్పిన్‌తోనే పాక్‌ని కట్టడి చేయాలని టీమిండియా భావిస్తున్నట్టు తెలుస్తోంది. అప్పుడు శార్దుల్ బెంచ్‌కే పరిమితం అవ్వాల్సి ఉంటుంది. ఇక పేసర్లుగా బుమ్రా, సిరాజ్ ఆడడం ఖాయమే. అయితే లాస్ట్ మ్యాచ్‌లో సిరాజ్ నిరాశపరిచాడు. టీమిండియా తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, బుమ్రా ALSO READ: స్టేడియంలోనే తన్నుకున్న క్రికెట్ ఫ్యాన్స్.. ఇండియా,అఫ్ఘాన్ మ్యాచ్ సమయంలో ఏం జరిగిందంటే? #india-vs-pakistan #icc-world-cup-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి