BCCI: 'అసలు బుర్ర పనిచేస్తుందా'? ఇలా చేస్తారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్..! అహ్మదాబాద్ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభానికి ముందు జరిగిన ప్రత్యేక సంగీత వేడుకను టీవీ లైవ్‌లో ప్రసారం చేయకపోవడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అసలు ప్రస్తుత బీసీసీఐ అధికారులకు వరల్డ్‌కప్ నిర్వహించడం వచ్చా అని ప్రశ్నిస్తున్నారు. సంగీత కార్యక్రమంలో ముగ్గురు అత్యుత్తమ బాలీవుడ్ స్టార్స్ అరిజిత్ సింగ్, శంకర్ మహదేవన్, సుఖ్వీందర్ సింగ్ స్డేడియం గ్యాలరీల్లో కూర్చున్న అభిమానులను అలరించారు. By Trinath 14 Oct 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి బీసీసీఐకి చివాట్లు తప్పడం లేదు. మొదట వరల్డ్‌కప్ షెడ్యూల్ విషయంలోనే ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. షెడ్యూల్ కూడా వేయడం రాదా అని తిట్టారు. మిగిలిన దేశాల గగ్గొలు పెడితే కొన్ని మ్యాచ్‌లను రీషెడ్యూల్ చేశారు. కొన్ని జట్లకు ఒక మ్యాచ్‌కు మరో మ్యాచ్‌కు మధ్య గ్యాప్ తక్కువ ఉండడంతో విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత టికెట్ల విషయంలో ఫ్యాన్స్‌కి మరింత కోపం వచ్చింది. 'బుక్‌మైషో(Book my show)'కి ఆన్‌లైన్‌లో టికెట్ విక్రయ బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. అయితే అమ్మకానికి పెట్టిన నిమిషాల వ్యవధిలోనే టికెట్లు అమ్ముడైపోయాయి. అయితే టికెట్ కొనుగోలు చేసేందుకు ఒకే సారీ ఎక్కువ మంది బుక్‌మైషో ఓపెన్ చేయడంతో సైట్ క్రాష్ అయ్యింది. ఇక వర్చువల్ వెయిటింగ్ టైమ్ అంటూ గంటల పాటు ఆన్‌లైన్‌లో వెయిట్ చేయించింది బుక్‌మైషో. తీరా గంటలు గడిచిన తర్వాత టికెట్లు సోల్డ్ అవుట్ అంటూ మెసేజ్ పెట్టింది. ఇది అభిమానులకు చిరాకు తెప్పించింది. Thoughts with the people who were ready to live 'tweet' the performances 🤣😂 https://t.co/nJqPT0dHte — Saurabh Malhotra (@MalhotraSaurabh) October 14, 2023 Matlab kaatne bol do bas. This is next level bc. Tickets lene mat do aur Ghar se dekhne mat do — Manish Agrawal (@IndiaUnited_OG) October 14, 2023 No one: BCCI decision makers pic.twitter.com/VwjZxK4UMe — Chirag Barjatya (@chiragbarjatyaa) October 14, 2023 ఓపెనింగ్ మ్యాచ్: వరల్డ్‌కప్ అంటే భారత్‌లో క్రికెట్ ఫీవర్ హై రేంజ్‌లో ఉంటుంది. అయితే ఈసారి పాకిస్థాన్‌తో మ్యాచ్ వరకు కూడా ఆ జోష్ కనిపించలేదు. ప్రాక్టీస్ మ్యాచ్‌లు వర్షం కురిసే అవకాశాలున్న స్టేడియంలలో పెట్టడం.. టీమిండియా ఆడాల్సిన రెండు వార్మప్ మ్యాచ్‌లు వర్షానికి రద్దవడవం ఫ్యాన్స్‌కు నచ్చలేదు. ఇక వరల్డ్‌కప్ ఓపెనింగ్ మ్యాచ్ ఎప్పుడైనా హోస్ట్ కంట్రీ ఆడితే బాగుంటుంది. గతంలో అలానే ఆడేవారు. 2011లో భారత్‌లో వరల్డ్‌కప్ మ్యాచ్ ప్రారంభం ఐనప్పుడు కూడా ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో సెహ్వాగ్ 175 రన్స్‌తో రెచ్చిపోవడంతో టోర్నీకి అదిరిపోయే స్టార్ట్ లభించినట్టు అయ్యింది. కోహ్లీ కూడా సెంచరీ చేయడంతో ఆ టోర్నీలో తర్వాతి మ్యాచ్‌లకు కూడా అదే హైప్ క్రియేట్ అయ్యింది. బీసీసీఐ బ్యాడ్ ప్లాన్ అంటే ఫైర్: ఈసారి మాత్రం ఆ జోష్ కనిపించలేదు. వరల్డ్‌కప్ జరుగుతుంది అసలు ఇండియాలోనేనా అన్న అనుమానం కలిగేలా తొలి మ్యాచ్ జరిగింది. హోస్ట్ కంట్రీ అయిన ఇండియా మ్యాచ్ లేకుండా బీసీసీఐ ఫస్ట్ మ్యాచ్‌ని ప్లాన్ చేయడం అనేక విమర్శలకు దారి తీసింది. 2019 ఫైనలిస్టులు న్యూజిలాండ్-ఇంగ్లండ్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. లక్షకు పైగా సీటింగ్ కెపాసిటీ ఉన్న అహ్మదాబాద్ స్టేడియం బోసి పోయి కనిపించింది. 4వేల మంది మహిళలకు ఉచిత ప్రవేశం అని బీసీసీఐ అధికారులు ప్రకటన చేసినా అసలు స్పందన లేదు. ఇక భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ చెన్నైలో జరిగింది అక్కడ కూడా స్టేడియంలో సీట్లు ఖాళీగా కనిపించాయి. సోల్డ్ అవుట్ అని బుక్‌మైషోలో చూపించిన టికెట్లు ఎలా ఖాళీగా కనిపించాయని ఫ్యాన్స్ ప్రశ్నించారు. ఇక తొలి మ్యాచ్ ప్రారంభానికి ముందు కచ్చితంగా ఓపెనింగ్ సెరమనీ ఉంటుంది. అయితే బీసీసీఐ ఆ పని చేయలేదు. ఇప్పుడు పాక్ వర్సెస్ ఇండియా మ్యాచ్‌కు ముందు సంబరాలు చేసింది. సింగర్స్‌తో పాటు సచిన్ లాంటి టాప్ సెలబ్రెటీలను పిలిచింది. ఇలా టోర్ని స్టార్ట్ అయిన పది రోజుల తర్వాత సెరమనీ ఏంటని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. అయితే వారి కోపాన్ని మరింత పెంచే పని చేశారు నిర్వాహకులు. అహ్మదాబాద్‌లో జరిగిన ఈ సెలబ్రేషన్స్‌కు టీవీలో లైవ్ ఇవ్వలేదు. ALSO READ: దోమను బ్యాట్‌తో బాదేసిన గిల్.. నువ్వు దేవుడివి సామీ.. ఇక ప్రత్యర్థులు అస్సాం ట్రైన్ ఎక్కాల్సిందే! #india-vs-pakistan #icc-world-cup-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి