'షాపింగ్ మాల్స్ పేరుతో పాకిస్థాన్ జెండాలు తయారు చేసి పెడతారా? షాపింగ్ మాల్స్ అడ్డా చేసుకుని లవ్ జిహాద్ పేరుతో హిందు యువతులను మోసం చేసే కుట్రలకు పాల్పడుతుంటే ఏం చేస్తున్నారు? అట్లాంటి షాపింగ్ మాల్స్‌కు అనుమతి ఎలా ఇచ్చారు? తక్షణమే ఆ షాపింగ్ మాల్స్‌ను మూసివేయాలి. లేకపోతే ఉరికించి ఉరికించి కొడతాం.' అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్(Bandi sanjay kumar) ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని ఓ షాపింగ్ మాల్‌లో పాక్ జెండాలను విక్రయిస్తున్నట్లు వార్తలు రావడంతో బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్దారు. ‘అట్లాంటి షాపింగ్ మాల్స్‌ను పెట్టినోళ్లకు బుద్దిలేదు. అనుమతి ఇచ్చినోళ్లకు, ప్రారంభించినోళ్లకు సిగ్గు లేదు.' అంటూ దుయ్యబట్టారు.
భారత మాతాకీ జై... అంటూ సంబురాలు:
క్రికెట్ ప్రపంచకప్‌లో భాగంగా పాక్ భారత్ విజయ దుందుభి మోగించిడంతో కరీంనగనర్‌లో క్రికెట్ అభిమానులు, బీజేపీ కార్యకర్తలు టవర్ సర్కిల్‌లో బాణా సంచా పేల్చి సంబురాలు చేసుకున్నారు. బండి సంజయ్ కుమార్ స్వయంగా బాణాసంచా పేల్చి, మిఠాయిలు తినిపిస్తూ సంబురాల్లో పాల్గొన్నారు. తెలంగాణ అంతటా భారత మాతాకీ జై... అంటూ సంబురాలు చేసుకుంటున్నారన్నారు. కొందరు ఫాల్తుగాళ్లు అక్కడక్కడా ఉంటూ పాకిస్తాన్ గెలవాలని కోరుకుంటున్నారని ఆరోపించారు బండి సంజయ్.
ఉరికించి కొడతాం:
గుజరాత్‌లో ఇండియా, పాక్ మధ్య జరిగిన ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్‌లో భారత్ గెలుపొందడం సంతోషం అని.. చాలా అద్బుతమన్నారు బండి సంజయ్. క్రీడాభిమానులు, దేశభక్తులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన మ్యాచ్ గెలవడం ఆనందమన్నారు. ఈ మ్యాచ్‌ను వీక్షించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు పలువురు ప్రముఖులు వెళ్లారన్నారు. ఈ మ్యాచ్ గెలిచినట్టే భారత్ ప్రపంచకప్‌ను కూడా కైవసం చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నామని తెలిపారు. గతంలో కరీంనగర్‌లో ఇలానే నల్ల జెండాలు పట్టుకుని తిరిగితే వీపంతా సాఫ్ చేసినమని.. ఇక్కడ కాదు.. ఎక్కడ పాక్‌కు అనుకూలంగా వ్యవహరించినా, వారు గెలవాలని కోరుకున్నా రోడ్లపై ఉరికించి కొడతామన్నారు బండి సంజయ్.
లవ్ జిహాద్ పేరుతో హిందు యువతులను మోసం చేసే కుట్రలా?
అటు లవ్ జిహాద్ పేరుతో హిందూ అమ్మాయిలను లోబర్చుకునే కుట్ర చేస్తున్నారన్నారు బండి సంజయ్. ప్రత్యేకంగా యువతను నియమిస్తున్నారని ఆరోపించారు. వాళ్ల ద్వారా దేశ ద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో అట్లాంటి షాపింగ్ మాల్స్‌కు ఎట్లా అనుమతిస్తారని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో
అట్లాంటి షాపింగ్ మాల్స్ పెడతానంటే తిరస్కరిస్తే.. తెలంగాణలో మాత్రం కేసీఆర్ కుటుంబం కమీషన్లకు కక్కుర్తి పడి అనుమతిస్తున్నారని ఆరోపించారు. గిఫ్ట్ ల పేరుతో దొబ్బుకుపోతున్నారని.. తక్షణమే అట్లాంటి షాపింగ్ మాల్స్‌ను మూసివేయాలని డిమాండ్ చేశారు బండి సంజయ్.
ALSO READ: అక్తర్‌కి గట్టిగా ఇచ్చిపడేసిన సచిన్, సెహ్వాగ్.. ఈ కౌంటర్ చూస్తే నవ్వు ఆపుకోలేరు భయ్యా!