World Cup 2023: నీకు దండం సామీ.. చేసింది చాలు.. ఇక తప్పుకో..!

వరల్డ్‌కప్‌లో ఇండియాపై పాకిస్థాన్‌ ఓడిపోవడాన్ని పాక్‌ జట్టు మాజీలు తట్టుకోలేకపోతున్నారు. కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌పై ఒకరి తర్వాత ఒకరు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా షోయబ్‌ మాలిక్‌ ఈ లిస్ట్‌లో చేరాడు. బాబర్‌ అవుట్ ఆఫ్ బాక్స్‌ థింక్‌ చేయలేడని.. కెప్టెన్‌గా తప్పుకుంటేనే మంచిదని అభిప్రాయపడ్డాడు.

New Update
World Cup 2023: నీకు దండం సామీ.. చేసింది చాలు.. ఇక తప్పుకో..!

ప్రపంచకప్‌ చప్పగా మొదలైనా ఇప్పుడిప్పుడే కాస్త రంజుగా మారుతోంది. అఫ్ఘాన్‌ చేతిలో ఇంగ్లండ్‌ ఓటమి క్రికెట్‌ అభిమానుల్లో జోష్ నింపింది. అఫ్ఘానిస్తాన్‌కి మద్దతుగా చాలామంది ఢిల్లీ స్టేడియానికి పోటెత్తారు కూడా. ఇక అంతకముందు ఇండియా వర్సెస్‌ పాక్ మ్యాచ్‌ను క్రికెట్ ప్రపంచం టీవీలకు అతుక్కుపోయి చూసింది. అటు ప్రపంచంలోనే అతి పెద్ద సీటింగ్ కెపాసిటీ కలిగిన అహ్మదాబాద్‌ స్టేడియం కూడా నిండింది. ఈ మ్యాచ్‌లో ఇండియా ఏడు వికెట్ల తేడాతో విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. వరల్డ్‌కప్‌(World cup)లో పాక్‌(Pakistan)పై ఇండియాకు ఇది వరుసగా 8వ గెలుపు.. ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్కసారి కూడా ఇండియాపై పాకిస్థాన్‌ గెలవలేదు. ఈ మ్యాచ్‌లో కూడా పాక్‌ ఓడిపోవడంతో అక్కడి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటు పాక్‌ మాజీ క్రికెటర్లు ప్రస్తుత టీమ్‌పై మండిపడుతున్నారు. ముఖ్యంగా కెప్టెన్ బాబర్‌ అజామ్‌(Babar Azam) టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తున్నారు..

publive-image బాబర్ అజామ్(Left), షోయబ్ మాలిక్(Right)

ఇక చాలులే తప్పుకో:
బాబర్‌ అజామ్ ప్లేయర్‌గా ఎలాంటి వాడో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ జనరేషన్‌ టాప్‌ బ్యాటర్లలో బాబర్‌ ఒకడు. అయితే కెప్టెన్సీలో మాత్రం బాబర్‌ అజామ్‌పై చాలా కాలంగా అనేక విమర్శలున్నాయి. ఇండియాపై ఓటమి తర్వాత ఆ విమర్శలు మరింత పెరిగాయి. మ్యాచ్‌ ముగిసిన తర్వాత తన అంకూల్ కొడుకు కోసం అంటూ కోహ్లీ దగ్గరకు వెళ్లి బాబర్‌ టీ షర్ట్ అడిగాడు. కోహ్లీ సైన్ చేసి టీ షర్ట్ ఇచ్చాడు. ఇదంతా గ్రౌండ్‌లో అందరిముందే జరిగింది. మ్యాచ్‌ ముగిసిన వెంటనే ఓ జట్టు కెప్టెన్ ఇలా చేయడం సరైనది కాదంటూ పాక్‌ లెజెండరీ క్రికెటర్‌ వసీమ్‌ అక్రమ్‌ బాబర్‌పై నిప్పులు చెరిగారు. అందరూ ఓడిపోయారన్న బాధలో ఉంటే బాబర్‌ ఇలా ఎందుకు చేశాడని అ జట్టు ఫ్యాన్స్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా వరుస పెట్టి బాబర్‌పై విమర్శలు పెరిగిపోతున్న సమయంలో ఆ జట్టు స్టార్‌ ప్లేయర్‌ షోయబ్‌ మాలిక్‌ సైతం రంగంలోకి దిగాడు. బాబర్‌పై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు.

‘బాబర్ అజామ్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని గతంలో కూడా చెప్పాను.. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. కెప్టెన్‌గా బాబర్ అవుట్ ఆఫ్ ది బాక్స్‌గా ఆలోచించడు. కెప్టెన్సీ చేస్తున్నాడు కానీ మెరుగవడం లేదు. ఆటగాడిగా పాకిస్థాన్‌కు అద్భుతాలు చేయగలడు..కెప్టెన్‌గా కాదు' అని మాలిక్‌ కామెంట్స్‌ చేశాడు.

తప్పు బాబర్‌దేనా?
నిజానికి ఇండియాపై మ్యాచ్‌లో పాక్‌ బ్యాటింగ్‌ ముందు భారీ స్కోర్ దిశగా సాగింది 29 ఓవర్లకు పాక్‌ 155/2 స్కోరు వద్ద ఉంది. ఆ టైమ్‌లో బాబర్‌, రిజ్వాన్‌ అవుట్ అవ్వడంతో టీమిండియా మిగిలిన ప్లేయర్ల భరతం పట్టింది. 300కు పైగా స్కోరు చేస్తుందని అంతా భావించగా.. 192 రన్స్‌కి ఆలౌట్ అయ్యింది. ఇలా ఒకరి తర్వాత ఒకరు సైకిల్‌ స్టెండ్‌ లెవల్‌లో కిందపడడం ఆ జట్టుకు కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలానే బొక్కబోర్లా పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పాక్‌ సెట్ చేసిన టార్గెట్‌ని ఇండియా చాలా ఈజీగా ఛేజ్‌ చేసింది. రోహిత్ శర్మ సిక్సర్ల వర్షంలో పాక్‌ బౌలర్లు తడిసిపోయారు. దీంతో పాక్‌ మరోసారి ఇండియాపై గెలవలేకపోయింది.

ALSO READ:  ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు.. కుంబ్లే రికార్డు వెనుక కారణం సచినే.. ఎలాగో తెలుసా?

Advertisment
తాజా కథనాలు