World Cup 2023: అదే సెంటిమెంట్‌ వర్క్‌ అవుట్ అయితే ఈ ప్రపంచకప్‌ మనదే బ్రదరూ!

వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌పై పోరులో సెంచరీ చేశాడు కింగ్ కోహ్లీ. దీంతో ఫ్యాన్స్‌ బ్రెయిన్‌లో 2011 ప్రపంచకప్‌ గుర్తొచ్చింది. అప్పుడు కూడా బంగ్లాదేశ్‌పై కోహ్లీ సెంచరీ చేశాడు.. ఆ ఏడాది ప్రపంచకప్‌ ఇండియానే గెలుచుకుంది. ఈ లాజిక్‌ ప్రకారం ఈ ఏడాది ప్రపంచకప్‌ కూడా భారత్‌నే గెలుస్తుందంటున్నారు ఫ్యాన్స్!

World Cup 2023: అదే సెంటిమెంట్‌ వర్క్‌ అవుట్ అయితే ఈ ప్రపంచకప్‌ మనదే బ్రదరూ!
New Update

ప్రపంచకప్‌(World Cup)లో టీమిండియా చెలరేగిపోతోంది. ఇప్పటివరకు ఓటమే ఎరగని రెండు జట్లలో భారత్ ఒకటి. న్యూజిలాండ్‌, ఇండియా ఇప్పటివరకు జరిగిన ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో ఏ మ్యాచ్‌ కూడా ఓడిపోలేదు. ఇప్పటివరకు ఇరు జట్లు నాలుగు మ్యాచ్‌లు ఆడగా.. ఎనిమిది పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. అయితే న్యూజిలాండ్‌కి నెట్‌రన్‌రేట్‌ కాస్త ఎక్కువగా ఉండడంతో నంబర్‌-1 స్పాట్‌లో కొనసాగుతోంది. ఈ రెండు జట్లు తర్వాత మ్యాచ్‌ల్లో అటు ఇటుగా ఆడినా సెమీస్‌కి వెళ్లడం ఖాయంగానే కనిపిస్తోంది. సెమీస్‌లో ఎలా ఆడుతారన్నదానిపై ఫ్యాన్స్‌ ఇప్పటినుంచే లెక్కలు వేస్తుండగా.. మరోవైపు ఓ సెంటిమెంట్‌ని భారత్‌ క్రికెట్‌ టీమ్‌ లవర్స్‌ హైలెట్ చేస్తున్నారు.

అప్పుడు ఏం జరిగిందంటే:
2011 ప్రపంచకప్‌ గుర్తింది కదా.. ఇండియా హోస్ట్ చేసిన ఆ ప్రపంచకప్‌లో భారత్ తన తొలి మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఆడింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌ సెహ్వగ్‌ వీరవిహారం చేశాడు. 175 రన్స్‌తో దుమ్మురేపాడు. ఇదే మ్యాచ్‌ ద్వారా వరల్డ్‌కప్‌లో తన ఫస్ట్ మ్యాచ్‌ ఆడాడు విరాట్‌ కోహ్లీ. ఈ మ్యాచ్‌లో కోహ్లీ కూడా సెంచరీ చేశాడు. 83 బాల్స్‌లో 100 చేసిన కోహ్లీ ఈ మ్యాచ్‌లో నాటౌట్‌గా నిలిచాడు. సెహ్వాగ్‌, కోహ్లీ సెంచరీలతో టీమిండియా 50 ఓవర్లలో 370 పరుగుల భారీ స్కోరును సాధించింది. లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌లో పర్వాలేదనిపించినా 50 ఓవర్లలో 283 రన్స్‌తోనే సరిపెట్టుకుంది. ఈ మ్యాచ్‌ విజయం తర్వాత భారత్‌ ఈ టోర్నీలో కేవలం సౌతాఫ్రికాతోనే ఓడిపోయింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ డ్రా చేసుకుంది. క్వార్టర్స్‌లో ఆసీస్‌, సెమీస్‌లో పాక్‌ని ఓడించిన నాటి ధోనీ టీమ్‌ ఫైనల్‌లో శ్రీలంకపై విక్టరీ కొట్టి 28ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌ను ముద్దాడింది.


ఏంటా సెంటిమెంట్‌:
ఇక నిన్నటి(అక్టోబర్‌ 19) మ్యాచ్‌ దగ్గరకు వద్దాం. పూణే వేదికగా బంగ్లాదేశ్‌పై నిన్న జరిగిన పోరులో కోహ్లీ(Kohli) సెంచరీతో మెరిశాడు. 97 బంతుల్లో 103 రన్స్‌ చేసిన నాటౌట్‌గా నిలిచాడు. దీంతో సెంచరీని 2011 బంగ్లాపై సెంచరీతో ముడి పెట్టి ఫ్యాన్స్‌ ఓ లాజిక్‌ని బయటకు తీశారు. క్రికెట్‌ని మతంగా భావించే భారత్‌లో ఈ గేమ్‌ను ఫాలో అవుతూ అందులోనుంచి కొన్ని అంతుబట్టని లాజిక్‌లు, సెంటిమెంట్లు తీసి ప్రచారం చేయడం మన ఫ్యాన్స్‌కు అలవాటు. 2011 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై కోహ్లీ సెంచరీ చేశాడని.. ఆ ఏడాది ప్రపంచకప్‌ గెలుచుకున్నామని.. ఈ ప్రపంచకప్‌లోనూ కోహ్లీ సెంచరీ చేశాడని.. అందుకే ఈ ప్రపంచకప్‌ ఇండియా గెలుస్తుందంటున్నారు కొంతమంది అభిమానులు. అప్పుడు నాటౌట్‌గా నిలిచినట్టే కోహ్లీ నిన్న కూడా నాటౌట్‌గా నిలిచాడని చెబుతున్నారు. మరి చూడాలి ఫ్యాన్స్‌ సెంటిమెంట్‌ వర్క్‌ అవుట్ అవుతుందా లేకపోతే బిస్కెట్‌ అవుతుందా అంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే!

Also Read: సెంచరీతో కదం తొక్కిన కింగ్‌ కోహ్లీ.. బంగ్లా బొక్క బోర్లా..!

#icc-world-cup-2023 #india-vs-bangladesh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe