AUS vs SA: ఇక కాస్కో కమ్మిన్స్‌.. ఫైనల్‌లో దబిడి దిబిడే..!

వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తడపడి.. నిలబడి విజయం సాధించింది.

New Update
AUS vs SA: ఇక కాస్కో కమ్మిన్స్‌.. ఫైనల్‌లో దబిడి దిబిడే..!

ICC WORLD CUP 2023: వరల్డ్‌కప్‌(World Cup) ఫైనల్‌లో ఇండియాతో ఆడే టీమ్‌ ఏదో తేలిపోయింది. ఐదుసార్లు వన్డే వరల్డ్‌కప్‌ విజేత, రెండు సార్లు రన్నరప్‌ అయిన ఆస్ట్రేలియా ఫైనల్‌కి దూసుకొచ్చింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన రెండో సెమీస్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా విజయం సాధించింది. ముందు బౌలింగ్‌లో సత్తా చాటిన ఆసీస్‌ తర్వాత బ్యాటింగ్‌లో ముందు కాస్త తడపడినా.. తర్వాత తేరుకోని.. నిలబడి విజయాన్ని అందుకుంది. దక్షిణాఫ్రికా మరోసారి కప్‌ లేకుండానే టోర్నీ ముగించింది.

మిల్లర్ ఒక్కడే:
ముందుగా బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా ఏ దశలోనూ భారీ స్కోర్‌ దిశగా అడుగులు వేయ్యలేదు. కెప్టెన్ బావూమా డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత సూపర్‌ ఫామ్‌లో ఉన్న డికాక్‌ 14 బంతులాడి 3 పరుగులే చేశాడు.హెజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో కమ్మిన్స్‌కు చిక్కాడు. ఆ దీంతో ప్రొటీస్‌ 8 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఆదుకుంటాడనుకున్న మార్క్‌రమ్‌, వ్యాన్‌ డర్‌ డసన్ బాల్స్‌ తింటూ జట్టును మరింత కష్టాల్లోకి నెట్టి ఔట్ అయ్యారు. ముఖ్యండా డసన్‌ టెస్టు మ్యాచ్‌ను తలపించాడు. 31 బంతులాడి కేవలం 6 పరుగులే చేశాడు. ఈ ఇద్దరూ చాలా స్లోగా ఆడడంతో దక్షిణాఫ్రికా 12 ఓవర్లకు కేవలం 24 రన్స్ చేసి 4 వికెట్లు కోల్పోయింది. ఇక ఆ తర్వాత క్లాసెన్, మిల్లర్‌ జట్టును గట్టెక్కించే బాధ్యతను భుజానా వేసుకున్నారు. ఈ క్రమంలో హాఫ్‌ సెంచరీ వైపుగా వెళ్తున్న క్లాసెన్‌ హెడ్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. 47బంతుల్లో 48 రన్స్ చేసి ఔట్ అయ్యాడు.


మరో ఎండ్‌లో మిల్లర్‌ మాత్రం ఎక్కడా కంగారు పడలేదు. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. ఈ క్రమంలోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 116 బంతుల్లో 101 రన్స్ చేసిన మిల్లర్‌ 9వ వికెట్‌గా వెనుతిరిగాడు. మిల్లర్‌ సెంచరీ చేయడంతో దక్షిణాఫ్రికా 212 రన్స్ అయినా చెయగలిగింది.


తడపడి..నిలబడి..!
213పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు గుడ్ స్టార్ట్ ఇచ్చారు. 6 ఓవర్లలోనే ఆస్ట్రేలియా 60 పరుగులు చేసింది. వేగంగా పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ మర్క్‌రమ్‌ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. 18 బంతుల్లోనే 29 రన్స్ చేసిన వార్నర్ ఖాతాలో నాలుగు సిక్సులు, ఒక ఫోర్ ఉంది. స్కోరు బోర్డు 60 వద్ద వార్నర్ వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా ఆ వెంటనే మిచెల్ మార్ష్ వికెట్‌ను కోల్పోయింది. రబడా బౌలింగ్‌లో డసన్‌ క్యాచ్‌తో మార్ష్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. మరో ఎండ్‌లో హెడ్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 48 బాల్స్‌లోనే 62 రన్స్ చేసిన హెడ్‌ మహారాజ్‌ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. హెడ్‌ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, రెండు సిక్సులు ఉన్నాయి. 14.1 ఓవర్లలోనే 106 రన్స్ చేసిన ఆస్ట్రేలియా గెలవడం ఈజీనే అని ఫ్యాన్స్ అనుకున్నారు. అయితే ఆ తర్వాత స్మిత్‌, లబూషేన్‌ స్లోగా బ్యాటింగ్‌ చేశారు. 31 బంతుల్లో 18 రన్స్ చేసిన లబూషేన్‌ షమ్సీ బౌలింగ్‌లో బోల్తా పడగా.. ఆ తర్వాత వెంటనే మ్యాక్స్‌వెల్‌ షమ్సీ బౌలింగ్‌లోనే బౌల్డ్ అయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది. ఇక ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన జోష్‌ ఇంగ్లిశ్‌తో కలిసి స్మిత్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. స్లోగా ఆడినా మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. 62 బంతుల్ఓ 30 రన్స్ చేసిన స్మిత్‌ గెరల్డ్‌ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత స్టార్క్‌తో కలిసి ఇంగ్లిశ్‌ మ్యాచ్‌ను ముందుకు నడిపించాడు. అయితే ఇంకో 20 రన్స్ చేయాల్సి ఉన్న సమయంలో అతను ఔట్ అవ్వడంతో మ్యాచ్‌పై ఉత్కంఠ పెరిగింది. ఇక తర్వాత కమ్మిన్స్‌, స్కార్క్‌ జాగ్రత్తగా ఆడుతూ మ్యాచ్‌ను గెలిపించారు. ఈ మ్యాచ్‌తో గెలుపుతో ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుకుంది. అహ్మదాబాద్‌లో ఆదివారం మోదీ స్టేడియంలో ఇండియా-ఆస్ట్రేలియా తలపడనున్నాయి.


Also Read: సౌత్ ఆఫ్రికా ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం

Advertisment
Advertisment
తాజా కథనాలు