ప్రపంచకప్‌లో రికార్డుల మోత కొనసాగుతోంది. దాదాపు ప్రతీమ్యాచ్‌లోనూ ఏదో ఒక రికార్డు నమోదవుతుంది. తాజాగా ఆసీస్ స్టార్ బ్యాటర్ గ్లెన్ మాక్స్‌వెల్ వండర్ క్రియేట్ చేశాడు. ప్రపంచకప్ చరిత్రలో వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. నెదర్లాండ్స్‌పై మ్యాచ్‌లో ఈ రికార్డు నెలకొల్పాడు. ఢిల్లీ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. కేవలం 40 బంతుల్లోనే 100 రన్స్ చేశాడు మాక్స్‌వెల్. ఇది ప్రపంచకప్‌లో ఫాస్టెస్ సెంచరీ.. గతంలో ఈ రికార్డు దక్షిణాఫ్రికా బ్యాటర్ ఐడెన్ మార్క్రామ్ పేరిట ఉంది. ఈ వరల్డ్‌కప్‌లోనే శ్రీలంకపై జరిగిన మ్యాచ్‌లో మార్క్రామ్ ఈ ఫీట్ సాధించాడు. కొన్ని రోజులకే ఈ రికార్డు బ్రేక్ అయ్యింది. గతంలో ఈ రికార్డు ఐర్లాండ్ స్టార్ కెవిన్ ఓ'బ్రియన్ పేరట ఉండేది. 2011 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై కెవిన్ 50 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓడిపోయింది. ఇక తాజాగా మార్క్రామ్ రికార్డుతో పాటు కెవిన్ ఓ బ్రియన్ రికార్డును కూడా బ్రేక్ చేశాడు మాక్స్‌వెల్(Glen Maxwell). మొత్తంగా 44 బంతుల్లో 106 రన్స్ చేసిన మాక్సీ ఖాతాలో 9 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి.
ప్రపంచ కప్‌లలో ఫాస్టెస్ట్ 100లు (బాల్స్ పరంగా)
40 - గ్లెన్ మాక్స్‌వెల్ వర్సెస్ నెదర్లాండ్స్, ఢిల్లీ, 2023
49 - ఐడెన్ మార్క్రామ్ వర్సెస్ శ్రీలంక, ఢిల్లీ 2023
50 - కెవిన్ ఓ'బ్రియన్ వర్సెస్ ఇంగ్లండ్, బెంగళూరు 2011
51 - గ్లెన్ మాక్స్‌వెల్ వర్సెస్ శ్రీలంక, సిడ్నీ 2015
52 - ఏబీ డివిలియర్స్ వర్సెస్ వెస్టిండీస్, సిడ్నీ 2015
రెండు సార్లు మ్యాక్సీనే:
వేగవంతమైన సెంచరీల లిస్ట్‌లో టాప్-5లో రెండు సార్లు మాక్స్‌వెలే ఉన్నాడు. 2015 ప్రపంచకప్‌లో సిడ్నీ వేదికగా శ్రీలంకపై జరిగిన మ్యాచ్ మాక్స్‌వెల్ వీరవీహారం చేశాడు. 51 బంతుల్లో సెంచరీ చేశాడు. ఇక ఐదో స్థానంలో దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ ఉన్నాడు. 2015 ప్రపంచకప్‌లో సిడ్నీ వేదికగా వెస్టిండీస్‌పై జరిగిన మ్యాచ్‌లో ఏబీడీ 52 బంతుల్లో సెంచరీ చేశాడు.
వన్డేల్లో వేగవంతమైన సెంచరీలు (బాల్స్ పరంగా)
31 - ఏబీ డివిలియర్స్ వర్సెస్ వెస్టిండీస్, జోబర్గ్, 2015
36 - కోరీ ఆండర్సన్ వర్సెస్ వెస్టిండీస్, క్వీన్స్‌టౌన్, 2014
37 - షాహిద్ అఫ్రిది వర్సెస్ శ్రీలంక, నైరోబి,1996
40 - గ్లెన్ మాక్స్‌వెల్ వర్సెస్ నెదర్లాండ్స్, ఢిల్లీ, 2023
అటు వన్డేల్లో వేగవంతమైన సెంచరీ జాబితాలో మాక్స్‌వెల్ నాలుగో స్థానంలోకి దూసుకొచ్చాడు. ఈ లిస్ట్‌లో తొలి స్థానంలో ఏబీడీ ఉన్నాడు. 2015లో జోబర్గ్ వేదికగా వెస్టిండీస్‌పై జరిగిన మ్యాచ్‌లో ఏబీ డివిలియర్స్ 31 బంతుల్లో సెంచరీ చేశాడు. ఇక అంతకముందు 2014లో న్యూజిలాండ్ ప్లేయర్ కోరీ అండర్సన్ క్వీన్స్‌టౌన్ వేదికగా వెస్టిండీస్‌పై 36 బంతుల్లో సెంచరీ చేయగా.. 1996లో పాక్ స్టార్ ప్లేయర్ షాహిద్ అఫ్రిది శ్రీలంకపై 37 బాల్స్‌లో సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు.
Also Read: టీమిండియాకు బిగ్ షాక్.. తర్వాతి రెండు మ్యాచ్‌లకు స్టార్ ప్లేయర్ దూరం!