Ashwin Became No.1 Bowler in Tests: ICC టెస్ట్ ర్యాంకింగ్ లో జస్ప్రీత్ బుమ్రా ను వెనకునెట్టి ఆఫ్ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ నెంబర.1 బౌలర్ గా నిలిచాడు. ఇటీవల ఇంగ్లాడ్ తో ముగిసిన 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో 26 వికెట్లు తీసిన అశ్విన్ నెం.1 స్థానానికి ఎగబాకాడు.
బుమ్రా ను వెనక్కునెట్టిమళ్లీ అగ్రస్థానానికి చేరుకున్న అశ్విన్
ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల్లో 26 వికెట్లు తీసిన అశ్విన్
తాజా బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో 15 స్థానాలు ఎగబాకిన కుల్దీప్ యాదవ్
తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లు వారి స్థానాలను మెరుగు పరుచుకున్నారు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 847 పాయింట్లతో నెం. 1 టెస్ట్ బౌలర్ గా ఉన్న జస్పీత్ బుమ్రా ను వెనక్కు నెట్టి 870 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. నవంబర్ 2015లో ICC టెస్ట్ ర్యాంకింగ్స్‌లో, ఇంగ్లండ్‌తో జరిగిన చివరి ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 4-1 తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు . అశ్విన్ ఐదు టెస్టుల్లో రెండు ఐదు వికెట్లతో సహా 26 వికెట్లు తీశాడు. రాజ్ కోట్ లో జరిగిన మూడవ టెస్ట్ సిరీస్ లో తన తల్లి ఆరోగ్య కారణాల దృష్ఠ్యా చెన్నై తిరిగి రావాల్సి వచ్చింది. అయితే అతను ఎదురుదెబ్బను అధిగమించి రాంచీ , ధర్మశాలలో జరిగిన చివరి రెండు టెస్టుల్లో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ధర్మశాలలో జరిగిన 100వ టెస్టులో, భారత్ 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. అశ్విన్ రెండు ఇన్నింగ్స్ ల లో కలిపి తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టెస్టులో అశ్విన్ 500 టెస్ట్ వికెట్ మైలు రాయిని సాధించాడు.అనిల్ కుంబ్లే తర్వాత ఎలైట్ క్లబ్‌లో చేరిన రెండో భారతీయుడు గా నిలిచాడు.
Also Read: గిల్ తో జరిగిన మాటల యుద్ధం పై స్పందించిన జేమ్స్ అండర్సన్