ICC Rankings: ఐసీసీ టాప్‌ కిరీటాన్ని కింగ్‌ మళ్లీ అందుకుంటాడా? ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ విడుదల!

వరల్డ్‌కప్‌ ఎడిషన్‌ ముందు వరకు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో 9వ స్థానంలో ఉన్న కోహ్లీ ఇప్పుడు నంబర్-3 పొజిషన్‌కు వచ్చాడు. యువ ఓపెనర్‌ గిల్‌ 826పాయింట్లతో టాప్‌ ప్లేస్‌లో ఉండగా.. కోహ్లీ 791 పాయింట్లతో థర్డ్‌ ప్లేస్‌, 769 పాయింట్లతో రోహిత్ నాలుగో స్థానంలో ఉన్నారు.

ICC Rankings: ఐసీసీ టాప్‌ కిరీటాన్ని కింగ్‌ మళ్లీ అందుకుంటాడా? ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ విడుదల!
New Update

ICC RANKINGS: నాలుగేళ్లు నంబర్‌ వన్ అతడే.. 1,258 రోజులు వరుసగా నంబర్‌ వన్ స్థానంలో ఉన్న కోహ్లీ తర్వాత ఒక్కసారిగా కిందకు పడిపోయాడు. 2017-2021 మధ్య కోహ్లీ ఐసీసీ వన్డే బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో నంబర్‌-1 పొజిషన్‌లో కొనసాగాడు. తర్వాత ఫామ్‌లేక తంటాలు పడ్డ కోహ్లీ గతేడాది అఫ్ఘాన్‌పై సెంచరీ తర్వాత పూర్వ ఫామ్‌ను అందుకున్నాడు. అప్పటినుంచి మొన్న వరల్డ్‌కప్‌ ముగిసే వరుకు కోహ్లీ వరుగుల సునామీ సృష్టించాడు. వరుసపెట్టి సెంచరీలు బాదాడు. అదే ఊపులో వరల్డ్‌కప్‌లోనూ మెరిశాడు. ఏకంగా 765 రన్స్‌తో టోర్ని టాప్‌ స్కోరర్‌గా నిలవడమే కాకుండా ప్లేయర్‌ ఆఫ్‌ ది అవార్డు అందుకున్నాడు. దీంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీ మరోసారి టాప్‌-4లోకి దూసుకొచ్చాడు.



కోహ్లీ ఏ ర్యాంకులో ఉన్నాడంటే:

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీ నంబర్‌-3 పొజిషన్‌కు వచ్చాడు. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 791 పాయింట్లు ఉన్నాయి. టాప్‌ ప్లేస్‌లో ఉన్న యువ ఓపెనర్‌ గిల్‌కు 826 పాయింట్లు ఉన్నాయి. వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ ఉండగా.. ఒకవేళ కోహ్లీ ఆ సిరీస్‌లో రెచ్చిపోతే టాప్‌కి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే కోహ్లీతో పాటు రోహిత్‌కు కూడా ఈ వన్డే సిరీస్‌కు రెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది.



టాప్-5 ఐసీసీ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌(వన్డే)

1. శుభమాన్ గిల్ - 826 రేటింగ్ పాయింట్లు

2. బాబర్ ఆజం - 824 రేటింగ్ పాయింట్లు

3. విరాట్ కోహ్లీ - 791 రేటింగ్ పాయింట్లు

4. రోహిత్ శర్మ - 769 రేటింగ్ పాయింట్లు

5. క్వింటన్ డి కాక్ - 760 రేటింగ్ పాయింట్లు



లిస్ట్‌ పరిశీలిస్తే టాప్‌-5 బ్యాటర్లలో ముగ్గురు భారతీయులే ఉండడం విశేషం. 769 పాయింట్లతో రోహిత్‌ నాలుగో స్థానంలో నిలిచాడు.

Also Read: ఓడిపోవడానికి అదే కారణం.. వారిలో ధైర్యం లేదు.. గంభీర్‌ ఘాటు విమర్శలు!

WATCH:

#rohit-sharma #cricket #virat-kohli #icc-odi-rankings
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe