T20 World Cup: రేపే తుది సమరం.. 18 ఏళ్ల నిరీక్షణకు రోహిత్ తెరదించుతాడా!

టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ పోరుకు సమయం ఆసన్నమైంది. భారత్ రెండోసారి పొట్టికప్‌ను ముద్దాడుతుందా. లేక ఫస్ట్ టైమ్ ఫైనల్ చేరిన సౌతాఫ్రికా కొత్త చరిత్ర సృష్టిస్తుందా. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ ఓడకుండా ఫైనల్ చేరిన ఇరుజట్ల బలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ఆర్టికల్ లోకి వెళ్లండి.

New Update
T20 World Cup: రేపే తుది సమరం.. 18 ఏళ్ల నిరీక్షణకు రోహిత్ తెరదించుతాడా!

T20 World Cup 2024 Final: టీ20 వరల్డ్ కప్ 2024 తుది సమరానికి సమయం ఆసన్నమైంది. అందరూ అనుకున్నట్లే అద్భుతమైన ఆటతీరుతో ఇండియా (India) ఫైనల్ లోకి దూసుకెళ్లగా.. టీ20 చరిత్రలో సౌతాఫ్రికా (South Africa) మొదటిసారి ఫైనల్లో అడుగుపెట్టింది. ఇరుజట్ల జూలై 29న టైటిల్ పోరు జరగనుంది. ఇరు జట్ల బలాలను పరిశీలిస్తే ఈ టోర్నీలో రెండు జట్లు ఒక్కమ్యాచ్ కూడా ఓడకుండానే ఫైనల్ చేరగా.. బ్యాటింగ్ బౌలింగ్ లోనూ సమతూకంగా కనిపిస్తున్నాయి. పదేళ్ల తర్వాత ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌కు టీమ్‌ఇండియా చేరుకోవడం గమనార్హం. కాగా దశాబ్దాల బలహీనతను జయిస్తూ దక్షిణాఫ్రికా.. ప్రపంచకప్పుల్లో తొలిసారి సెమీఫైనల్‌ దాటింది. ఏ ఫార్మాట్లోనైనా ఆ జట్టుకిదే తొలి ప్రపంచకప్‌ ఫైనల్‌. ఈ క్రమంలో ఫైనల్ పోరు రసవత్తరంగా సాగనున్నట్లు క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

గతేడాది 2023 వరల్డ్ కప్ అందినంట్లే అంది చేజారిపోవడం భారత్ ఫ్యాన్స్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ బాధనుంచి తేరుకోవడానికి భారత్‌కు ఇప్పుడు మరో అవకాశం వచ్చింది. 2007లో ధోనీ (MS Dhoni) నాయకత్వంలో టైటిల్‌ విజేతగా నిలిచిన ఇండియా మరోసారి కోచ్ రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మల (Rohit Sharma) ఆధ్వర్యంలో రెండోసారి పొట్టి కప్ ను ఒడిసిపట్టి 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని కోరుకుంటున్నారు.

అదరగొడుతున్న ఇండియా..
ఈసారి భారత బ్యాంటింగ్ లైనప్ కొంత నిరాశపరిచినా బౌలింగ్ లో మాత్రం అదరగొడుతోంది. కొత్త బంతితో అర్ష్ దీప్, బుమ్రాలు (Jasprit Bumrah) పవర్ ప్లేలోనే కీలక వికెట్లు తీయగా.. మిడిల్ ఓవర్లో స్పిన్నర్లు, అక్షర్ పటేల్, కుల్దీప్, జడేజాలు బ్యాట్స్ మెన్ ను ముప్పుతిప్పలు పెడుతున్నారు. పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లో భీకరమైన హిట్టర్లను సైతం తెలివిగా బురిడికొట్టించి పెవిలియన్ పంపారు. సౌతాఫ్రికాతోనూ ఫైనల్లో భారత బౌలింగ్ మరింత కీలకం కానుంది.

సౌతాఫ్రికాకు బలమైన బ్యాటింగ్ లైనప్..
ఇక సౌతాఫ్రికా విషయానికొస్తే.. డికాక్, హ్యాండ్రిక్స్, మార్కరమ్, క్లాసెన్, మిల్లర్ రూపంలో బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. తనదైన రోజున క్లాసెన్, మిల్లర్ తలచుకుంటే ఏ జట్టునైనా, ఎంతటి బౌలర్ నైనా ఉతికి ఆరేయగలరు. ఇక బౌలింగ్ లోనూ జాన్సెన్, కేశవ్ మహారాజ్, రబాడ, నోర్టజ్, షంషీలు అదరగొడుతున్నారు. ముఖ్యంగా షంపీ గత మూడు మ్యాచ్ లుగా కీలకంగా మారాడు. మిడిల్ ఓవర్లలో పార్ట్ నర్ షిప్ లను దెబ్బతీస్తూ సౌతాఫ్రికాకు విజయాన్ని అందించడంలో తనవంతు పాత్ర పోషిస్తున్నాడు. ఇక వన్డే ప్రపంచకప్‌లో 4సార్లు, టీ20 ప్రపంచకప్‌లో 2సార్లు (2009, 2014) సెమీస్‌లో ఇంటిముఖం పట్టిన సౌతాఫ్రికా.. ఈసారి పెద్దగా అంచనాల్లేకుండానే అద్భుతమైన ఆటతీరుతో ఫైనల్ కు చేరింది. గ్రూప్‌ దశలో న్యూజిలాండ్‌కు, సూపర్‌-8లో ఆస్ట్రేలియాకు షాకిచ్చిన సఫారీలు.. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో అఫ్గానిస్థాన్‌ చిత్తుగా ఓడించారు. మొత్తానికి ఎన్నో ఏళ్లుగా తమను వేంటాడుతున్న చేదు జ్ఞాపకాలను చెరిపేస్తూ తొలిసారి ఫైనల్‌ చేరడం క్రికెట్ లవర్స్ ను ఆనందానికి గురిచేస్తోంది.

ఇక ఫైనల్‌కు (T20 World Cup Final) ముందు భారత సహచరులకు రోహిత్ సందేశం ఇచ్చాడు. బార్బడోస్‌లో జరిగే T20 ప్రపంచ కప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో తలపడేటప్పుడు జట్టు సభ్యులంతా ప్రశాంతంగా ఉండాలని కోరాడు. సెమీఫైనల్ విజయం తర్వాత రోహిత్ మాట్లాడుతూ.. 'జట్టుగా మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం. పిచ్ పరిస్థితులను అర్థం చేసుకున్నాం. ఫైనల్‌లో మేము ప్రశాంతంగా ఆడాలనుకుంటున్నాం. అది మాకు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. ఈ గేమ్‌లోనూ మేము స్థిరంగా, ప్రశాంతంగా ఉన్నాం. పెద్దగా భయపడట్లేదు. అది మాకు చాలా కీలకం. కప్ గెలవాలంటే మంచి క్రికెట్ ఆడాలి' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక రెండు టీమ్ లు తుది జట్టులో పెద్దగా మార్పులేమీ చేయకుండానే రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. అంచనా ప్రకారం భారత్, సౌతాఫ్రికా ఫైనల్ టీమ్ కూర్పు ఇలా ఉండనుంది.

ఇరుజట్ల అంచనా:

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, అర్ష్ దీప్ సింగ్.

సౌతాఫ్రికా: మార్కరమ్ (కెప్టెన్), డికాక్, హెన్రిక్స్, క్లాసెన్, డెవిడ్ మిల్లర్, స్టబ్స్, జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, నోర్టెజ్, షంషీ. 

Also Read: కోచ్‌లు, పిచ్‌లు, కిట్లు.. అఫ్ఘాన్‌ క్రికెట్‌కు ఇండియా చేసిన సాయం ఇదే!

Advertisment
తాజా కథనాలు