Cricket News: సెహ్వాగ్‌కు అత్యున్నత గౌరవం.. డాషింగ్‌ ఓపెనర్‌కు ఐసీసీ సలామ్!

టీమిండియా మాజీ ఆటగాడు, డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌కు ఐసీసీ అత్యున్నత పురస్కారం లభించింది. హాల్‌ ఆఫ్‌ ది ఫేమ్‌లో సెహ్వాగ్‌తో పాటు టీమిండియా విమెన్ క్రికెటర్‌ డయానా ఎడుల్జీ, శ్రీలంక లెజెండ్‌ అరవింద డి సిల్వాకు చోటు దక్కింది.

Cricket News: సెహ్వాగ్‌కు అత్యున్నత గౌరవం.. డాషింగ్‌ ఓపెనర్‌కు ఐసీసీ సలామ్!
New Update

Virendar sehwag: క్రికెట్‌లో ఇప్పటివరకు ఎన్నో రకాల ప్లేయర్లను చూశాం.. ఎందరో ఆటగాళ్లు వచ్చారు.. తమదైన ముద్ర వేశారు.. రిటైర్‌ అయ్యారు.. అభిమానులకు మరిచిపోలేని జ్ఞాపకాలను మిగిల్చారు. ప్రపంచానికి ఎంతోమంది గొప్ప ఆటగాళ్లను పరిచయం చేసింది టీమిండియా. అందులో వీరేంద్ర సెహ్వాగ్‌ ఒకరు. భారత్‌ జట్టులో సచిన్‌, ద్రవిడ్‌ లాంటి ప్లేయర్లకు రిప్లేస్‌మెంట్ దొరికింది కానీ.. సెహ్వాగ్‌ లాంటి మరో ఆటగాడు రాలేదు. టెస్టుల్లోనూ వేగంగా బ్యాటింగ్‌ చేయడం, వందకు పైగా స్ట్రైక్‌రేట్‌తో సెంచరీలు చేయడం సెహ్వాగ్‌కే సాధ్యం. ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ జట్లను సైతం వణికించిన ప్లేయర్ సెహ్వాగ్‌. క్రికెట్‌లో ఎన్నో రికార్డులు సృష్టించిన సెహ్వాగ్‌కు ఐసీసీ అత్యున్నత పురస్కారం లభించింది.

హాల్‌ ఆఫ్‌ ది ఫేమ్‌లో సెహ్వాగ్‌:
ఐసీసీ(ICC) హాల్ ఆఫ్ ఫేమ్‌లో ముగ్గురు ఆటగాళ్లకు స్థానం లభించింది. వీరేంద్ర సెహ్వాగ్, డయానా ఎడుల్జీ, అరవింద డి సిల్వా ఈ క్లబ్‌లో చేరారు. ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చేరడంపై సెహ్వాగ్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఈ గౌరవం ఇచ్చినందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌తో పాటు జ్యూరీకి థ్యాంక్స్‌ అని చెప్పాడు. అటు ఎడుల్జీకి సైతం ఈ ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ది ఫేమ్‌లో ప్లేస్‌ దొరకడం విశేషం. దేశం తరపున 54 మ్యాచ్‌లు ఆడారు ఎడుల్జీ. ఎడమచేతి వాటం స్పిన్నరైన ఎడుల్జీ ఖాతాలో 100కు పైగా ఎక్కువ వికెట్లు ఉన్నాయి. అడ్మినిస్ట్రేటర్‌గా కూడా అద్భుతంగా పని చేశారు. దేశంలో మహిళా క్రికెటర్లకు ఉపాధి అవకాశాలను పెంచడానికి కృషి చేశారు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న మొదటి భారతీయ మహిళ ఎడుల్జీ.

ఛాంపియన్‌కు చోటు:
1996 ప్రపంచ కప్ ఫైనల్‌లో శ్రీలంకను గెలిపించాడు డిసిల్వా. ఫైనల్‌లో సెంచరీ కొట్టిన డిసిల్వా దూకుడుగా బ్యాటింగ్‌ చేస్తాడు. 93 టెస్టుల్లో 6,361 పరుగులు సాధించగా, 308 వన్డేల్లో 9,284 పరుగులు చేశాడు. అటు భారత్‌కు 104 టెస్టులు, 251 వన్డేలు, 19 టీ20 మ్యాచ్‌లు ఆడాడు సెహ్వాగ్‌. 2011 వన్డే ప్రపంచ కప్‌, 2007 టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకున్న జట్టు సభ్యుల్లో సెహ్వాగ్‌ ఉన్నాడు. టెస్టుల్లో 23 సెంచరీలతో 8,586 పరుగులు చేశాడు. టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ కొట్టిన మొదటి ఇండియన్‌ ప్లేయర్ సెహ్వాగే. ఇక టెస్టు ఫార్మాట్‌లో రెండుసార్లు 300 పరుగుల మార్క్‌ను అధిగమించిన కేవలం నలుగురు ఆటగాళ్లలో సెహ్వాగ్‌ ఒకడు. టెస్టుల్లో 80కు పైగా స్ట్రైక్‌ రేట్‌తో పాటు వన్డేల్లో 100కు స్టైక్‌ రేట్‌ కలిగి ఉన్న ప్లేయర్‌.

Also Read: భారత ప్రజల మనసు దోచుకున్న ఆఫ్ఘాన్ క్రికెటర్

WATCH:

#cricket #virender-sehwag #icc-world-cup-2023 #diana-edulji #aravinda-de-silva
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe