ICAI CA Results: CA ఫౌండేషన్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా!

ICAI-CA ఫౌండేషన్ పరీక్ష ఫలితాలను ప్రకటించింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ icai.nic.inని విజిట్ చేసి స్కోర్‌కార్డ్‌ను చెక్‌ చేయవచ్చు. మొత్తం 1,37,153 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవగా ఇందులో 41,132మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.

New Update
ICAI CA Results: CA ఫౌండేషన్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా!

ICAI CA Results Out: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ICAI) సీఏ(CA) ఫౌండేషన్ ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ icai.nic.in ని విజిట్ చేసి రిజల్ట్స్‌ను చెక్‌ చేసుకోవచ్చు. పరీక్ష డిసెంబర్ 31,2023 జనవరి 2,4,6న ఆఫ్‌లైన్ మోడ్‌లో నిర్వహించిన విషయం తెలిసిందే. 280కి పైగా నగరాల్లో పరీక్ష నిర్వహించారు. మొత్తం 1,37,153 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇందులో మొత్తం 41,132 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. CA ఫౌండేషన్ 2023 ఉత్తీర్ణత శాతం 29.99శాతం. పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి, అభ్యర్థులు ప్రతి సబ్జెక్టులో 40శాతం మార్కులు, మొత్తంగా 50శాతం మార్కులు సాధించాలి.

ఈ విధంగా ఫలితాన్ని తనిఖీ చేయండి:
--> ముందుగా అధికారిక వెబ్‌సైట్ icai.nic.in కి వెళ్లండి.
--> హోమ్‌పేజీలో 'CA ఫౌండేషన్ ఫలితం 2023' లింక్‌పై క్లిక్ చేయండి.
--> కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది.
--> ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.
--> ఇప్పుడు 'సమర్పించు(సబ్మిట్)' బటన్ పై క్లిక్ చేయండి.
--> రిజల్ట్‌ కనిపిస్తుంది.. డౌన్లోడ్ చేసుకోండి!

Also Result: టీడీపీ, బీజేపీ పెళ్లి.. రెండు అడుగులు వేయడానికి అంగీకారం!

WATCH:

Advertisment
తాజా కథనాలు