Raju Narayana Swamy: ఈ కుళ్లిపోయిన వ్యవస్థతో పోరాడలేక.. దేశాన్ని వదిలివెళ్లాడు

1983లో ఆ కుర్రాడు పదో తరగతి పరీక్ష రాశాడు. స్టేట్ ఫస్ట్ వచ్చాడు. 1985లో ఇంటర్మీడియట్ పరీక్షలో స్టేట్ ఫస్ట్. ఐఐటి ఎంట్రన్స్ పరీక్ష రాస్తే మళ్లీ స్టేట్ ఫస్ట్. 1989లో చెన్నై ఐఐటీ నుంచి కంప్యూటర్ సైన్సు కోర్సు పూర్తిచేశాడు బ్యాచ్ ఫస్ట్ వచ్చాడు. అదే ఏడాది రాసిన గేట్ ఎగ్జామ్‌లోనూ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు.

New Update
Raju Narayana Swamy: ఈ కుళ్లిపోయిన వ్యవస్థతో పోరాడలేక.. దేశాన్ని వదిలివెళ్లాడు

ప్రతి పరీక్షలోనూ ఫస్ట్.. 

1983లో ఆ కుర్రాడు పదో తరగతి పరీక్ష రాశాడు. స్టేట్ ఫస్ట్ వచ్చాడు. 1985లో ఇంటర్మీడియట్ పరీక్షలో స్టేట్ ఫస్ట్. ఐఐటి ఎంట్రన్స్ పరీక్ష రాస్తే మళ్లీ స్టేట్ ఫస్ట్. 1989లో చెన్నై ఐఐటీ నుంచి కంప్యూటర్ సైన్సు కోర్సు పూర్తిచేశాడు బ్యాచ్ ఫస్ట్ వచ్చాడు. అదే ఏడాది రాసిన గేట్ ఎగ్జామ్‌లోనూ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు.

అమెరికా ఆహ్వానం వద్దనుకున్నాడు.. 

ఇంత తెలివి ఉన్న వ్యక్తిని అగ్రరాజ్యం అమెరికా ఎర్రతివాచీ పరిచి, గ్రీన్ కార్డు వీసా ఇచ్చి, పచ్చజెండా ఊపి మరీ మామెసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరమని సీటు ఇచ్చింది. మామూలు వ్యక్తి అయితే ఎగిరి గంతేసేవాడు కదా. కానీ ఈయన మాత్రం 'నా చదువుకు నా ప్రభుత్వం డబ్బు ఖర్చు చేసింది. ప్రభుత్వం డబ్బంటే ప్రజల డబ్బు! ప్రజల డబ్బంటే పేదల చెమట... వాళ్ల రక్తం... వారు కొనే వస్తువులపైన, వేసుకునే బట్టలపైనా, చెల్లించే బస్సు టికెట్టుపైనా కట్టిన పన్నులే... తనను చదివించాయి! 'అలాంటిది ఆ పేదల స్వేదాన్ని... జీవన వేదాన్ని వదిలి అమెరికా వెళ్లడం ఏమిటి' అనుకున్నారు. అంతే దేశంలోనే ఉండి ఐఏఎస్ పరీక్ష రాశారు.

సొంత మామ తప్పు చేసినా సరే.. 

చిన్నప్పటినుంచీ నేర్చుకున్న విలువలు పేదల పట్ల ప్రేమ, ఏదో చేయాలన్న తపన... వీటన్నిటికీ సరిపోయే ఉద్యోగం వచ్చిందనుకున్నారు. అతని పేరే రాజు నారాయణ స్వామి. కేరళలోని పాల్ఘాట్ కి చెందిన వ్యక్తి. అయితే అసలు చిక్కులు అక్కడ్నించే మొదలయ్యాయి. ప్రతి చోటా అవినీతి అధికారులు, మంత్రులు, స్వార్థపరులు రాజ్యమేలడం కనిపించింది. ఎక్కడికక్కడ పోరాటం చేయాల్సి వచ్చింది. ఒక చోట ఒక మెడికల్ కాలేజీ లోని వ్యర్థజలాలు రైతుల పొలాల్లోకి వెళ్తుంటే అడ్డుకున్నారు. మరుక్షణమే ఆయనకు ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ వచ్చింది. ఆ తరువాత పిల్లను ఇచ్చిన సొంత మామ రోడ్డును బ్లాక్ చేస్తూ భవనం కట్టుకున్నారు. ఇంకేముంది ఆ భవనాన్ని కూల్చి వేయించారు. మామకు కోపం రావడంతో భర్త మీద అలిగిన భార్య రాజు నారాయణ స్వామిని వదిలి వెళ్లిపోయారు.

ఎలాంటి ప్రాధన్యత లేని విభాగంలోకి..

ఆ తరువాత రాజు నారాయణస్వామి పన్నులు ఎగవేసిన ఒక లిక్కర్ డాన్ ఇంటిపై సోదాలు జరిపించారు. అంతే లిక్కర్ డాన్‌కి మద్దతుగా ఏకంగా ఒక మంత్రి ఫోన్ చేశారు. కలెక్టర్ అవినీతిపై పోరాటంలో రాజీ లేదన్నారు. అంతే ...!మళ్లీ ట్రాన్స్ ఫర్... మళ్లీ కొత్త ఊరు... కొత్త పని...! కొత్త చోట వానాకాలానికి ముందు మట్టితో చెరువులకు, నదులకు గట్లు వేయడం, బిల్లులు వసూలుచేసుకోవడం ఆ తరువాత వానలు పడటం... వానకి గట్టు కొట్టుకుపోవడం... మళ్లీ టెండర్లు... మళ్లీ పనులు... మళ్లీ బిల్లులు... మళ్లీ వానలు...ఇదే తంతు కొనసాగేది. రాజు నారాయణ స్వామి.... దీన్ని అడ్డుకున్నారు. వానాకాలం అయ్యాక, కట్టలు నిలిస్తేనే బిల్లులు.... ఇచ్చేది అన్నారు. మంత్రులు మళ్లీ ఫోన్లో బెదిరింపులు.. కలెక్టర్ ససేమిరా.. అంతే మళ్లీ పాత కథ పునరావృతం అయింది. ఎక్కడ వేసినా ఈయనతో ఇబ్బందేనని అప్పటి కేరళ వామపక్ష ముఖ్యమంత్రి అచ్యుతా నందన్ మన రాజునారాయణస్వామిని ఎలాంటి ప్రాధాన్యత లేని ఓ విభాగంలో పారేశారు.

పోరాడలేక దేశాన్నే వదిలివెళ్లాడు..

చివరికి ఆయన నిజాయితీని, పని పట్ల ఆయన శ్రద్ధను చూసి ఐక్యరాజ్యసమితి నుంచి ప్రత్యేకంగా ఆహ్వానం వచ్చింది. 'మా దగ్గర పనిచేయండి' అని కోరుతూ పిలువు వచ్చింది.
ఒక నిజాయితీపరుడైన ఐఏఎస్ అధికారి ఈ వ్యవస్థలో ఇమడలేక, అవినీతితో రాజీ పడలేక ఎక్కడో ప్యారిస్ దేశంలో పనిచేయడానికి సిద్ధమయ్యారు. రాజు నారాయణ స్వామి రాసిన 23 పుస్తకాలకు చాలా ప్రజాదరణ వచ్చింది. ఆయన వ్రాసిన నవలకు సాహిత్య ఎకాడెమీ అవార్డు కూడా వచ్చింది. ఆయన వ్రాసిన నవలల్లో హీరో అన్యాయంపై విజయం సాధించి ఉండొచ్చు. కానీ నిజ జీవితంలో హీరో అయిన రాజు నారాయణస్వామి మాత్రం పోరాడలేక అలసి దేశాన్నే వదలాల్సి వచ్చింది.

నోట్: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ సారాంశం ఇది.

#NULL
Advertisment
Advertisment
తాజా కథనాలు