/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-12-7.jpg)
Telangana Assembly Session:తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) సవాల్ చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని కాంగ్రెస్ పార్టీ (Congress Party) చెప్పుకుంటుందని ఫైర్ అయ్యారు. ఇప్పటికి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఉద్యోగాలు ఇచ్చిందని తెలంగాణ యువత చెబితే తాను తన పదవికి రాజీనామా చేస్తామని కేటీఆర్ అన్నారు. దీనికి రేవంత్ సర్కార్ కట్టుబడి ఉందా? అని ప్రశ్నించారు.
Follow Us