Balineni Srinivasa Reddy : ఏపీలో ఎన్నికలు(AP Elections) సమయం పడుతున్న వేళ ఏపీ రాజకీయాల్లో (AP Politics) అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి(Balineni Srinivasa Reddy) సంచలన ప్రకటన చేశారు. ఇవే నా చివరి ఎన్నికలు..చివరి సారిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అంటూ బాంబు పేల్చారు.
వచ్చే ఎన్నికల్లో మా అబ్బాయి...
అయితే వచ్చే ఎన్నికల్లో మా అబ్బాయి పోటీ చేస్తారని వివరించారు. మీ అందరి దయతో తిరిగి ఒంగోలు(Ongole) లోనే పోటీ చేస్తున్నాను అని స్పష్టం చేశారు. పట్టాల కోసం వెళ్లి కూర్చుంటే పార్టీ మారుతున్నానని రకరకాలు వార్తలు వ్యాపించాయి. ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, నేను కలిసి పోటీ చేస్తానని ఇప్పటికే చాలా సార్లు తెలిపాను. దానికి సంబంధించిన ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వివరించారు.
వైసీపీ జెండా ఎగరవేయడానికి..
ఏపీలో మరోసారి వైసీపీ(YCP) జెండా ఎగరవేయడానికి ప్రతి కార్యకర్త పాటు పడలాని బాలినేని పిలుపునిచ్చారు. ఒంగోలులో పేదలకు పట్టాలు పంపిణీ చేస్తామని వివరించారు. పట్టాలు, ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే పోటీ కూడా చేయనని ముఖ్యమంత్రికి తెలిపినట్లు గుర్తు చేసుకున్నారు. ఒంగోలు ప్రజలకు చేసిన వాగ్దానం నెరవేర్చకపోతే రాజకీయాలకు స్వస్తి పలుకుతానని తెలిపారు.
పట్టాలు ఇవ్వటమే కాకుండా..
పేదల ఇళ్ల స్థలాల కోసం 231 కోట్ల రూపాయలను విడుదల చేసిన ఏపీ సీఎం జగన్(AP CM Jagan) కు ధన్యవాదాలు తెలిపారు. ఆయన 25 వేల మందికి పట్టాలు ఇవ్వటమే కాకుండా ఇళ్ల ను కూడా కట్టించి ఇస్తానని మాట ఇచ్చారు. ఆయన మాట ఇచ్చారంటే అది కచ్చితంగా జరిగి తీరుతుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
పేదలకు వచ్చే నెల 10 లోపే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని బాలినేని స్పష్టం చేశారు. ఏపీ మొత్తం జగనన్న కాలనీలు వచ్చినా కూడా ఒంగోలు లో మాత్రం టీడీపీ నేతలు వాటిని రాకుండా అడ్డుకున్నారని బాలినేని ఆరోపించారు. ఆ దేవుని దయ, జగన్ దయ వల్లే పేదలకు ఇళ్ల స్థలాలు, డబ్బులు వచ్చాయంటూ సంతోషం వ్యక్తం చేశారు.
Also read: కాలం ఏదైనా ఒంట్లో నీటి శాతం ఎంత ఉందో ఇలా చెక్ చేసుకోండి