Dinesh Karthik: ఆ రెండే నన్ను బాధించాయి.. ఒకటి ముంబై.. మరొకటి! భారత క్రికెటర్ దినేశ్ కార్తిక్ తన కెరీర్ లో ఎదురైన రెండు అనుభవాలను ఎప్పటికీ మరిచిపోలేనన్నాడు. ఒకటి ముంబై ఇండియన్స్ నన్ను రిటైన్ చేసుకోకుంటే బాగుండు. యువకుడిగా వేలంలోకి వెళ్లి నిరూపించుకోవాలని అనుకున్నా. రెండోది సొంత రాష్ట్రం చెన్నై తరఫున ఆడలేకపోవడం బాధకరం' అన్నాడు. By srinivas 09 Apr 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Cricket: భారత క్రికెటర్, కామెంటేటర్ దినేశ్ కార్తిక్ తన కెరీర్‌లో ఎదురైన మంచి చెడుల గురించి ఓపెన్ అయ్యాడు. తన జీవితంలో రెండు విషయాలపై ఇప్పటికీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో ఆర్సీబీకి ఆడుతున్న కార్తిక్.. రీసెంట్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ముంబై రిటైన్ చేసుకోకుంటే బాగుండు.. ఈ మేరకు కార్తిక్ మాట్లాడుతూ.. తన జీవితంలో పెద్దగా బాధపడే అంశాలు పెద్దగా లేవని చెప్పాడు. కానీ ఐపీఎల్ కెరీర్‌లో దేనిపై విచారం వ్యక్తం చేస్తావని అడిగితే మాత్రం ఒకటి ముంబై అని చెప్పాడు. ముంబై ఇండియన్స్ నన్ను రిటైన్ చేసుకోకుంటే బాగుండు. యువకుడిగా వేలంలోకి వెళ్లి నిరూపించుకోవాలని అనుకున్నా. ఒకవేళ నేను అప్పుడు ఆ జట్టుతోపాటు కొనసాగి ఉంటే మరింత మెరుగైన ఆటగాడిగా మారేవాడినేమోనని అనిపించింది. రోహిత్, రికీ పాంటింగ్ జట్టును తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఇప్పుడు దశాబ్దం తర్వాత బాధ పడుతున్నా. ఆకాశ్, అనంత్, నీతా అంబానీతో ఇప్పటికీ నాకు మంచి అనుబంధం ఉందని చెప్పాడు. ఇది కూడా చదవండి: T20 Worldcup: సీనియర్లకే మొగ్గుచూపుతున్న యాజమాన్యం.. తుది జట్టు ఇదే! చెన్నై తరఫున ఆడలేకపోవడం.. అలాగే రెండొవది.. సొంత రాష్ట్రానికి చెందిన చెన్నై తరఫున ఒక్కసారి కూడా ఆడలేకపోవడం బాధకరమన్నాడు. 'యెల్లో జెర్సీని ధరించలేకపోయా. కానీ, చెన్నై యాజమాన్యంపై ఇప్పటికీ గౌరవం ఉంది. ప్రతి వేలంలో నన్ను తీసుకొనేందుకు ప్రయత్నించింది. కానీ, అది కుదరలేదు’ అని అన్నాడు. కోల్‌కతాకు సారథిగా బాధ్యతలు నిర్వర్తించా. వ్యక్తిగత ప్రదర్శనతోపాటు జట్టులోని సభ్యుల నుంచి మెరుగైన ప్రదర్శన రాబట్టాల్సి ఉంటుంది. నాయకత్వం వల్ల కొన్ని సందర్భాల్లో స్నేహం కూడా కోల్పోవాల్సి వస్తుంది. నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు కుల్‌దీప్ యాదవ్ రాణించలేదు. దీంతో కొన్ని మ్యాచ్‌ల తర్వాత బెంచ్‌పై ఉంచాం. ఆ సమయంలో అతడితో మాట్లాడటమే చాలా ఇబ్బందిగా అనిపించేది. అయితే, ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొని రాటుదేలిన అతడు టాప్ బౌలర్‌గా మారాడంటూ గతాన్ని గుర్తు చేసుకున్నాడు. #dinesh-karthik #i-will-never-forget-these-two-things మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి