Yuvraj: మరోసారి బయటపడ్డ యువరాజ్,ధోనీ కోల్డ్ వార్!

యువరాజ్ సింగ్, ధోనీ మధ్య వివాదం మరోసారి బయటపడింది.ఇటీవలె యువరాజ్ తన వరల్డ్ ప్లేయింగ్ లెవన్ టీం ను ప్రకటించారు. అయితే ఈ జట్టులో భారత్ నుంచి ముగ్గురికి యువరాజ్ అవకాశం కల్పించగా ధోనీ కి మాత్రం చోటు ఇవ్వలేదు.దీంతో వీరిద్దరి మధ్య వివాదం మరోసారి బయటకు వచ్చింది.

Yuvraj: మరోసారి బయటపడ్డ యువరాజ్,ధోనీ కోల్డ్ వార్!
New Update

Yuvraj - Dhoni: భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రపంచ స్థాయి 11 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు. తన ప్రత్యర్థి ఆండ్రూ ఫ్లింటాఫ్‌కు కూడా చోటు కల్పించాడు. కానీ భారత క్రికెట్ దిగ్గజం ధోనీకి మాత్రం చోటు దక్కలేదు. దీంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

ఇటీవల యువరాజ్ సింగ్ సారధ్యంలోని భారత ఛాంపియన్స్ వరల్డ్ లెజెండ్స్ ఛాంపియన్‌షిప్ టీ20 (World Championship Of Legends) ఫైనల్ లో పాక్ ఛాంపియన్‌లను ఓడించి ట్రోఫీని గెలుచుకుంది. దీంతో ఓ యాంకర్ యువరాజ్ సింగ్‌ను ప్రపంచంలోని అత్యుత్తమ 11 మంది సభ్యుల జట్టును ఎంపిక చేయమని అడిగారు. యువరాజ్ సింగ్ కేవలం ముగ్గురు భారతీయ ఆటగాళ్లతో ప్రపంచ స్థాయి 11 మంది సభ్యుల జట్టును ఎంచుకున్నారు.

ఆ ముగ్గురు భారత ఆటగాళ్లలో ధోనీ పేరు లేదు. యువరాజ్ సింగ్ ఎంపిక చేసిన ప్రపంచ క్రికెట్ XI - సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, రికీ పాంటింగ్, విరాట్ కోహ్లీ, AB డివిలియర్స్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, ఆండ్రూ ఫ్లింటాఫ్, వసీం అక్రమ్, షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్, గ్లెన్ మెక్‌గ్రాత్,ఆండ్రూ ఫ్లింటాఫ్‌ జట్టులో చోటు దక్కించుకున్నారు.అయితే 2007 టీ20 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్‌కు ఇంగ్లండ్‌ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాఫ్‌ కు మధ్య వివాదం చేటుచేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.ఆ తర్వాత స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్లో యువరాజ్ సింగ్ ఆరు సిక్సర్లు బాదాడు.

Also Read: నెట్ ఫ్లిక్స్ లో తాప్సీ ‘దిల్‌రుబా’.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..?

ఈ క్రమంలో ప్లేయింగ్ లెవన్ లో తన సహచరుడు ధోనిని ఈ జట్టులో తన ప్లేయింగ్ లెవన్ లో ఎంపిక చేయలేదు. కానీ ఫ్లింటాఫ్‌ కు ఎంపిక చేయటం ఇటు ధోనీ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ 11 మంది సభ్యుల జట్టులో ఆడమ్ గిల్‌క్రిస్ట్ స్థానంలో ధోనీని ఎంపిక చేసే అవకాశం ఉంది. ఎందుకంటే గిల్‌క్రిస్ట్ వన్డే జట్టులో ఓపెనర్‌గా ఆడేవాడు. జట్టులో ఓపెనర్లుగా సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మలను యువరాజ్ సింగ్ ఎంపిక చేయగా, మిడిలార్డర్‌లో ధోని వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ఎంపిక చేయోచ్చు కానీ అతన్నికాదని గిల్ క్రిస్ట్ పేరు యువరాజ్ తెలిపాడు. 2007లో ధోనీ కెప్టెన్సీపై యువరాజ్ సింగ్ అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. అందుకే ధోనీ పేరును తప్పించి ఉండొచ్చని అభిమానులు అంటున్నారు.

#yuvraj-singh #dhoni
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe