/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-23T230919.343.jpg)
Srikanth: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతోన్న బెంగళూరు రేవ్ పార్టీతో తనకు సంబంధాలున్నాయనే వార్తలపై నటుడు శ్రీకాంత్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనకు ఆ డ్రగ్స్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, ఇప్పటికే దీనిపై వీడియో రిలీజ్ చేశానని చెప్పాడు. ‘నాపైన దుష్ప్రచారం చేస్తే ఊరుకోను. నా పేరు మీడియాలో వచ్చిన ముందు రోజే నేను ఒక ఆడియో ఫంక్షన్‌కు వెళ్ళాను. నాకు సంబంధం లేకుండా నన్ను ఇన్వాల్వ్ చేస్తే మీడియా హౌసెస్‌కు నోటీసులు ఇస్తాను. నా పేరు బెంగళూరు పోలీసులు చెప్పినా వాళ్లకు కూడా నేను నోటీసులు ఇస్తాను. శ్రీకాంత్ అంటేనే ఫ్యామిలీ మాన్.. నాపైన ఈ ఆరోపణలు కరెక్ట్ కాదు. ఏదైనా ఇక కోర్టులో చూసుకుంటాను. లీగల్‌గా వెళ్తాను. నిజంగా నేను ఆ పార్టీలో ఉంటే నాపైన ఎలాంటి యాక్షన్ తీసుకున్నా నేను సిద్ధమే. పార్టీలో ఎవరు ఉన్నారో స్పష్టంగా తెలుసుకుని వాళ్లను వదిలి పెట్టకండి’ శ్రీకాంత్ అన్నారు.