AP News : నానిని చంపాలనే ఉద్దేశం లేదు.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులిపర్తి నానిని చంపే ఉద్దేశం తనకు లేదని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. పులివర్తి నాని పట్ల తనకు రాజకీయ విభేదాలు మాత్రమే ఉన్నాయని, వ్యక్తిగతంగా ఎలాంటి కక్ష సాధింపు లేదని స్పష్టం చేశారు.

AP News : నానిని చంపాలనే ఉద్దేశం లేదు.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
New Update

Tirupati : చంద్రగిరి టీడీపీ (TDP) ఎమ్మెల్యే అభ్యర్థి పులిపర్తి నాని (Pulivarthi Nani) మీద దాడి చేయాలనే ఉద్దేశం తనకు లేదని చంద్రగిరి వైసీపీ (YCP) ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. పులివర్తి నాని పట్ల తనకు రాజకీయ విభేదాలు మాత్రమే ఉన్నాయని, వ్యక్తిగతంగా ఎలాంటి కక్ష సాధింపు లేదని స్పష్టం చేశారు. రాజకీయం అనేది జీవితంలో ఒక భాగం కావాలి తప్పా.. జీవితమే రాజకీయం కాకూదని చెప్పారు. కానీ పులివర్తి నాని జీవితమే రాజకీయమని భావిస్తున్నాడన్నారు.

అలాగే నాని కారును ధ్వంసం చేయాలని వైసీపీ నాయకుడు భాను ప్రకాష్ రెడ్డి భావించాడే తప్పా నానిని చంపాలనే ఉద్దేశంతో కాదన్నారు. పద్మావతి మహిళా యూనివర్సిటీ (Padmavathi Women's University) లో దాడుల సమయంలో యాక్టివ్ గా ఉన్న నాని 2 గంటల తర్వాత వీల్ చైర్ లోకి ఎలా ఎక్కారు. పులివర్తి నాని ఎమోషనల్ డ్రామా ఆడుతున్నాడు. దాని కారణంగా పోలీస్ అధికారులు బలి అయ్యారు. హుషారుగా ఉన్న వ్యక్తి డ్రెస్ సడెన్ గా ఎలా మారింది? వీల్ చైర్ మీదకు ఎలా ఎక్కారు? నామినేషన్ రోజు నా మీద దాడి చేసే ప్రయత్నం చేసినా కారు దిగకుండానేవెళ్లిపోయా. సహనంతో వ్యవహరించా. ఐదేళ్లలో ఎప్పుడూ ఎలాంటి ఆరోపణలు, ఘర్షణలు చేయలేదు. పులువర్తి సుధారెడ్డి 13, 14వ తేదీల్లో యాక్టివ్ గా ఉన్నా 15వ తేదీ ఆమె చేతికి కర్ర ఎలా వచ్చిందో? మహానటి సుధా రెడ్డి. కూచువారి పల్లెలో నాని సమక్షంలోనే వైసీపీ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని లూఠీ చేశారు. తర్వాత దహనం చేశారు. ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకొని ముందుకు సాగే వాడే నాయకుడు. పులివర్తి నాని తనను గెలిపించకపోతే చనిపోతానన్నాడు. ఓట్ల కోసం ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేవాడు నాయకుడు కాదంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

Also Read : సంగారెడ్డి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం..

#ap-tdp #chevireddy-bhaskar-reddy #pulivarthi-nani
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe