/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/JD-Lakshmi-Narayana-1-jpg.webp)
JD Lakshmi Narayana: ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు మరికొన్ని రోజుల సమయం ఉండడంతో అన్ని పార్టీలు ప్రచారాల్లో దూసుకుపోతున్న వేళ జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అంతమొందించే విశాఖలో కుట్ర జరుగుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీకి ఫిర్యాదు చేశారు. దీనిపై తనకు విశ్వసనీయ సమాచారం ఉందని అన్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని సీపీకి ఫిర్యాదు చేశారు. గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు తనను చంపేందుకు ప్లాన్ చేసినట్లు ఆరోపణలు చేశారు. కాగా జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ.. జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. కాగా ఏపీలో రానున్న ఎన్నికల్లో జై భారత్ నేషనల్ పార్టీ కూడా పోటీ చేస్తోంది. విశాఖ నార్త్ నుంచి ఎమ్మెల్యే గా జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం లేపాయి.
Also Read: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన నేతలు