అభిమానులు నన్ను అలా పిలవడం నచ్చలేదు.. నయన్ షాకింగ్ కామెంట్స్

ప్రముఖ నటి నయనతార తనను లేడీ సూపర్‌ స్టార్‌ అని పిలవడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అభిమానులను నన్ను ఇలా పిలవడం నచ్చలేదు. ‘జవాన్‌’ సినిమా తర్వాత మరింతమంది ఇదే పేరుతో పిలుస్తున్నారు. నిజానికి ఎవరైనా అలా పిలిస్తే నన్ను తిట్టినట్లు అనిపిస్తుందని చెప్పారు.

అభిమానులు నన్ను అలా పిలవడం నచ్చలేదు.. నయన్ షాకింగ్ కామెంట్స్
New Update

స్టార్ నటి నయనతార అభిమానులు తనను బిరుదులతో పిలవడం అసలే నచ్చదంటోంది. అంతేకాదు తనకు అలా పిలుపించుకోవాలనే తపన లేదని, సాధారణంగానే పలకరిస్తే బాగుటుందని సూచిస్తోంది. ఈ మేరకు నయన్ నటించిన తాజా చిత్రం ‘అన్నపూరణి’. పూర్తి ఫ్యామిలీ అండ్ ఫుడ్ నేపథ్యం స్టోరీతో వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 1న విడులై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న నయనతార తన పర్సనల్ అండ్ కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

publive-image

Also read: BREAKING : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

‘అభిమానులను నన్ను ఇంతలా ఆదరిస్తున్నందుకు ఆనందంగా ఉంది. అయితే కొంతకాలంగా నన్ను లేడీ సూపర్‌ స్టార్‌ అని పిలుస్తున్నారు. కానీ ఇలా పిలుపించుకోవడం నాకు నచ్చలేదు. ‘జవాన్‌’ సినిమా తర్వాత మరింత మంది ఇదే పేరుతో పిలుస్తున్నారు. నిజానికి ఎవరైనా అలా పిలిస్తే నన్ను తిట్టినట్లు అనిపిస్తుంది' అని చెప్పింది. ఇక బిరుదులనేవి కొంతమందికి గొప్పగా అనిపించినా తాను మాత్రం పెద్దగా ఇష్టపడనని చెప్పింది. ఇక 'జవాన్' మూవీ తర్వాత తనకు పెరిగిన ఆధరణపై మాట్లాడుతూ.. అదంతా వారి అభిమానం. ఈ రోజు నేను ఇంతమంది ప్రేమాభిమానాలు పొందుతున్నానంటే అది ఇండస్ట్రీ వల్ల నాకు దక్కిన గౌరవంగా భావిస్తా. ఇంత కీర్తిని పొందాలంటే ఎంతో అదృష్టం చేసుకోవాలంటూ హ్యాపీగా ఫీల్ అయింది. ఇక నయనతార 75వ చిత్రంగా వచ్చిన ‘అన్నపూరణి’ సినిమా ‘ది గాడెస్‌ ఆఫ్‌ ఫుడ్‌’ అనేది ఉపశీర్షికతో నీలేష్‌ కృష్ణ తెరకెక్కించారు. సంప్రదాయ కుటుంబంలో జన్మించిన అమ్మాయి.. మాంసాహార వంటలకు సంబంధించిన రెస్టారెంట్‌ పెట్టుకోవాలనుకున్న తన కలను ఎలా నెరవేర్చుకుంది అనే కథతో ఇది తెరకెక్కించగా జనాలను ఆకట్టుకుంటోంది. ఇదిలావుంటే.. ప్రస్తుతం నయన్ ‘టెస్ట్‌’ అనే సినిమాలోనూ నటిస్తోంది. ఆర్‌.మాధవన్‌, సిద్ధార్థ్‌ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌.శశికాంత్‌ తెరకెక్కిస్తున్నారు.

#nayanthara #lady-superstar
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe