Anand Mahindra: ఐయాం రెడీ.. థాంక్యూ బీసీసీఐ..!

ఐయాం రెడీ.. థాంక్యూ బీసీసీఐ, టెక్ మహీంద్రా అంటూ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా పోస్టు పెట్టారు. ఆనంద్ పంచుకున్న ఫొటోల్లో టీమిండియా జెర్సీ ఉంది. ఈ ప్రత్యేక జెర్సీని బీసీసీఐ ఆనంద్ మహీంద్రాకు బహూకరించినట్టు తెలుస్తోంది.

New Update
Anand Mahindra: ఐయాం రెడీ.. థాంక్యూ బీసీసీఐ..!

Anand Mahindra: దేశంలో వరల్డ్ కప్ మేనియా నెలకొంది. క్రీడలను విశేషంగా అభిమానించే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కూడా నేను రెడీ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. నేటి నుంచి నవంబరు 19 వరకు భారత్ లో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ పోటీలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో స్పందించారు.ఐయాం రెడీ.. థాంక్యూ బీసీసీఐ, టెక్ మహీంద్రా అంటూ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా పోస్టు పెట్టారు.

ఆనంద్ పంచుకున్న ఫొటోల్లో టీమిండియా జెర్సీ ఉంది. దానిపై ఆనంద్ 55 అని రాసి ఉంది. ఈ ప్రత్యేక జెర్సీని బీసీసీఐ ఆనంద్ మహీంద్రాకు బహూకరించినట్టు తెలుస్తోంది. మహీంద్రా గ్రూప్ నకు చెందిన ఐటీ విభాగం టెక్ మహీంద్రా బీసీసీఐకి డిజిటల్ పార్టనర్ గా కొనసాగుతోంది.

భారతదేశంలోని మోస్ట్ సక్సెస్‌ఫుల్ కంపెనీల్లో మహీంద్రా గ్రూప్‌ ఒకటి. దీనికి ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన సోషల్ మీడియా ద్వారా దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. అయితే మహీంద్రా గ్రూప్‌ వ్యాపారాల్లో ఆనంద్ తప్ప మిగతా కుటుంబ సభ్యులు ఎవరూ అడుగు పెట్టలేదు. ఈ దిగ్గజ పారిశ్రామికవేత్తకు ఇద్దరు కుమార్తెలు దివ్య (Divya), ఆలికా (Aalika) ఉన్నారు. వీరు ఉన్నత విద్యావంతులు. కానీ గ్రూప్ బిజినెస్‌కి వీరు ఎంట్రీ ఇవ్వలేదు. మహీంద్రా గ్రూప్ ఏరోస్పేస్, అగ్రికల్చర్, ఆటోమోటివ్, డిఫెన్స్, ఎనర్జీ, ఫైనాన్స్, హాస్పిటాలిటీ, ఐటీ, లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్, రిటైల్ వంటి వివిధ రంగాలలో విస్తరించింది.

Also Read: వరల్డ్‌కప్ లో మొదటి మ్యాచ్…టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కీవీస్

#anand-mahindra-tweet
Advertisment
తాజా కథనాలు