/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-27T144640.153-jpg.webp)
Nithiin: టాలీవుడ్ హీరో నితిన్ తనకు ఊర మాస్ సినిమాలు సెట్ కావంటున్నారు. తాను అలాంటి స్టోరీలు ఎప్పుడూ చేయలేదని, భవిష్యత్తులోనూ చేయనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన నటించిన తాజా చిత్రం 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' (Extra Ordinary Man) డిసెంబర్ 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న హీరో కెరీర్ అనుభవాలతోపాటు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మేనరిజం గురించి కూడా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
Also read :అదో రకమైన ప్రపంచం.. బాలీవుడ్ పై సన్యా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పక్కా మాస్ స్టోరీలు సెట్ కావనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఇకపై అలాంటి కథలతో సినిమాలు చేయనను. ఫన్, కమర్షియల్ అంశాలతో కూడిన కథల్లో మాత్రమే నటించాలని ఫిక్స్ అయ్యానని చెప్పారు. అలాగే ‘నా సినిమాల్లో పవన్ కల్యాణ్ మేనరిజాన్ని ఎక్కువగా చూపిస్తున్నానంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కానీ నాకంటే ఎక్కువ మంది హీరోలు వాళ్ల సినిమాల్లో పవన్ ఇమేజ్‌ను చూపించారు. ఇక ‘ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మేన్’లో ఒక సీన్‌లో భాగంగా పవన్‌లా డ్రెస్ వేసుకున్నా. అంతేగానీ ఫొటోషూట్ కోసం అలా రెడీ కాలేదు.
నేను హీరోనైనా ఆయనకు మాత్రం అభిమానినే. ఇదే మాట ఎప్పుడూ చెబుతాను. నేను ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చాను. మొదటి నుంచి పవన్‌కు అభిమానిననే చెబుతాను’ అన్నారు. ప్రస్తుతం నితిన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక టోటల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ దర్శకత్వం వహించగా శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్రలో కనిపంచనున్నారు.