IAS Smitha Sabharwal:లేదు నేనెక్కడికీ వెళ్ళడం లేదు..ఆ వార్తలన్నీ అవాస్తవం-స్మితా సభర్వాల్

కేంద్ర ప్రభుత్వానికి డిప్యుటేషన్ మీద వెళుతున్నానని వస్తున్న వార్తలన్నీ అబద్ధమన్నారు ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్. ఈ మేరకు ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు.

New Update
IAS Smitha Sabharwal:లేదు నేనెక్కడికీ వెళ్ళడం లేదు..ఆ వార్తలన్నీ అవాస్తవం-స్మితా సభర్వాల్

Smitha Sabharwal: లేదు లేదు నేనెక్కడీ వెళ్ళడం లేదు. నా గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. ఏదేదో ఊహించేసుకుంటున్నారు. కానీ నేను ఇక్కడే తెలంగాణకు చెందిన కేడర్ గానే ఉంటానంటు అని తేల్చి చెప్పేశారు ఐఏఎస్ స్మితా సభర్వాల్. తెలంగాణ ప్రభుత్వం ఏ పదవి ఇచ్చినా చేస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రయాణంలో భాగమవుతున్నందుకు గర్విస్తున్నా అంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.

అంతకు ముందు స్మితా సభర్వాల్ కేంద్ర సర్వీసులకు వెళుతున్నారంటూ వార్తలు వచ్చాయి. దీనికి ముందు ఆమె చేసిన ట్వీట్ కూడా వైరల్ అయింది. కొత్త బాధ్యతలు స్వీకరించడానికి రెడీగా ఉన్నానంటూ ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అయిందా. దానికి తోడు కొత్త సీఎం రేవంత్ ను ఇప్పటి వరకు మర్యాదపూర్వకంగా కూడా కలవకపోవడంతో స్మితా సభర్వాల్ కేంద్ర సర్వీసులకు వెళిపోతున్నారంటూ వార్తలు వచ్చాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు