Businessman : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ఒకవైపు సినిమాలతోపాటు వ్యాపారాల్లోనూ(Businessman) రాణిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల ఎన్నో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతున్న ఆయన.. బిజినెస్ రంగం నుంచి నెమ్మదిగా వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ ఈవెంట్ లో తాను ఓ బ్యాడ్ బిజినెస్ మెన్ అంటూ తనని తానే వర్ణించుకోవడం చర్చనీయాంశమైంది.
రీసెంట్ గా ఓ బిజినెస్ ఈవెంట్ లో పాల్గొన్న చెర్రీ.. వ్యాపారాలు సక్సెస్ చేయడంలో తానో వీక్ పర్సన్ అన్నారు. నాకు సినిమా తప్ప ఇంకేమీ తెలియదు. అనవసరంగా వ్యాపార రంగంలో తల దూర్చాను. సినిమాలు, సినిమా నిర్మాణానికి సంబంధించిన వ్యాపారం చేయడం ఇష్టం. అవి కాకుండా ఇంకేమీ వ్యాపారాలు చేయలేను. అంకెల వ్యవహారం మనకి సరిపడటం లేదు. పైగా అలా చేస్తే రెండు పడవల ప్రయాణం అవుతుంది. అందుకే ఇక వ్యాపారాలు చేయకూడదనుకుంటున్నా. నాకు తెలిసిన సినిమా నటన రంగం.. ఆ తర్వాత నిర్మాణం ఈ రెండు వ్యవహారాలే చూస్తా. గతంలో చేసిన వ్యాపారాలేవి కలిసి రాలేదన్నారు. ఇక సినిమాలకు సంబంధించి తన సొంత నిర్ణయాలతో ముందకెళ్తానని, అందరూ చెప్పేది వింటానన్నారు. అలాగే చివరిగా నిర్ణయం తీసుకునేటప్పుడు, అన్ని ఆలోచించి తానే స్వయంగా తీసుకున్న నిర్ణయాన్ని అమలుపరుస్తానని చెప్పారు.
ఇది కూడా చదవండి : RGV Vs Journalist : రక్తం మడుగులో శృంగారం.. ఆర్జీవీ Vs జర్నలిస్ట్ వార్ వైరల్
అయితే రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తున్న ఫ్యాన్స్.. మొత్తానికి రామ్ చరణ్ వ్యాపారాల్లో నష్టాలు రావడంతో రియలైజ్ అయినట్లు ఉన్నారంటున్నారు. ఇక ఇటీవల ట్రూజెట్ విమానయాన సంస్థని చరణ్ కొన్నాళ్లు రన్ చేసిన సంగతి తెలిసిందే. అందులో భారీగా నష్టాలు రావడంతో ఆపేసారు. ఇంకా బయటకు తెలియని వ్యాపారాలు చరణ్ చాలానే చేసి ఉండొచ్చు. వాటి నష్టాలు చరణ్ ని ఇలా వెనక్కి లాగి పెడుతూ ఉండొచ్చు. మరి చరణ్ తీసుకున్న సంచలన నిర్ణయంపై మరోసారి ఆలోచన చేస్తారేమో చూడాలంటున్నారు సినీ, వ్యాపార విశ్లేషకులు.