BREAKING: హైడ్రా దూకుడు.. ఈరోజు కూల్చేది వాళ్లదే!

TG: హైడ్రా దూకుడు పెంచింది. ఈరోజు బాచుపల్లి బౌరంపేట, బోరబండ సున్నపు చెరువులో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అక్కడికి పోలీసులు భారీగా మోహరించారు.

BREAKING: హైడ్రా దూకుడు.. ఈరోజు కూల్చేది వాళ్లదే!
New Update

Hyda: హైడ్రా దూకుడు పెంచింది. అక్రమకట్టడలపై ఉక్కుపాదం మోపుతోంది. చెరువులు, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను కూల్చివేస్తున్నారు అధికారులు. బాచుపల్లి బౌరంపేట, బోరబండ సున్నపు చెరువులో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అక్కడికి పోలీసులు భారీగా మోహరించారు. అమీన్‌పూర్‌ లేక్‌ పరిధిలో పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని ఫామ్‌హౌస్‌ దగ్గరకు హైడ్రా అధికారులు చేరుకొని కూల్చివేతలు మొదలు పెట్టారు.

హైడ్రా కూల్చివేతలతో బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని ప్రశ్నిస్తున్నారు. తమ వద్ద అనుమతులు ఉన్నాయని.. ఒకవేళ బఫర్ లేదా FTL జోన్ లో ఉందని ముందే తెలిసి ఉంటే ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఎందుకు పర్మిషన్ ఇచ్చింది?.. ఎందుకు పన్నులు కట్టించుకుంటున్నారు అని బాధితులు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

హైడ్రా విస్తరణ..

అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా మరింత బలోపేతం అయ్యేందుకు సిద్ధమైంది. పైలట్ ప్రాజెక్ట్ కింద కేవలం హైదరాబాద్ వరకు పరిమితం అయిన హైడ్రాను ఇప్పుడు హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (HMDA) వరకు విస్తరించేందుకు రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మొత్తం మూడు జోన్లుగా విభజించి, వాటి బాధ్యతలను ఎస్పీ స్థాయి అధికారులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

కాగా సెంట్రల్‌ జోన్‌గా హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌, నార్త్‌ జోన్‌గా సైబరాబాద్‌, సౌత్‌ జోన్‌గా రాచకొండను విభజించేందుకు సన్నాహాలు చేస్తోంది. వీటికి జోనల్‌ అధికారులు, పూర్తిస్థాయి సిబ్బందిని నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ మొదలు పెట్టింది. ఈ మూడు జోన్లను చీఫ్‌ కమిషనర్‌ పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం రెండు నెలల కిందట ప్రత్యేక జీవో ద్వారా ఏర్పాటైన హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు న్యాయశాఖ అధ్యయనం చేస్తోంది. కాగా దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్టు సమాచారం.

#hydra
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe