Hydra: హైదరాబాద్ లో భూ ఆక్రమణలు.. అక్రమ నిర్మాణాలు ఎక్కడ చూసినా కనిపిస్తాయి. నిత్యం అక్కడ ఈ దందాలపై ఫిర్యాదులు వస్తూనే ఉంటాయి. ఈ దందాల వెనుక రియల్ ఎస్టేట్ కంపెనీలు.. రాజకీయ నేతలు ఉంటారనే ఆరోపణలు ఎప్పుడూ వినిపిస్తాయి. అయితే, ప్రస్తుతం ఇలాంటి దందాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఎక్కడ అక్రమ నిర్మాణం కనపడినా చర్యలు తీసుకోవడానికి సిద్ధం అయిపోయింది. ఇందుకోసం వ్యవస్థను పటిష్టం చేసింది. ఇందుకోసం హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీని ఏర్పాటు చేసింది. దీనికి సారధిగా ఐజీ రంగనాధ్ ను నియమించింది. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పుడు హైడ్రాకు పెద్ద ఎత్తున అధికారులను కేటాయిస్తూ ఆదేశాలిచ్చారు ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్. మొత్తం 259మంది ఆఫీసర్లు.. సిబ్బందిని కేటాయించారు. ఒక ఐపీఎస్, ముగ్గురు గ్రూప్1 స్థాయి ఎస్పీయేలు, 5గురు డిప్యూటీ సూపరింటెండెంట్స్, 21మంది ఇన్సపెక్టర్స్, 33 మంది ఎస్సైలు, 12గురు రిజర్వ్ ఎస్సైలు, 101 మంది కానిస్టేబుల్స్, 72 మంది హోమ్ గార్డ్స్, అనలిటిక్ ఆఫీసర్లు, అసిస్టెంట్ అనలిటికల్ ఆఫీసర్లను హైడ్రాకు ఇచ్చారు.
పూర్తిగా చదవండి..Hydra: హైడ్రా అంటే హడల్.. ఆక్రమణదారులకు వణుకు పుట్టాల్సిందే!
హైదరాబాద్ లో భూఆక్రమణదారులను హైడ్రా హడలెత్తిస్తోంది. ఎక్కడ అక్రమ నిర్మాణం కనపడినా.. నిమిషాల్లో నేలమట్టం చేసేస్తోంది. ఐజీ రంగనాధ్ ను హైడ్రాకు సారధిగా నియమించింది రేవంత్ సర్కార్. ఈ నేపథ్యంలో అసలు హైడ్రా ఏంటి?, దాని విధులు ఏంటి? అన్న వివరాలను ఈ స్టోరీలో తెలుసుకోండి.
Translate this News: