Hydra Fastest Action: హైడ్రా పరుగులు.. మెరుపు వేగంతో కూల్చివేతలు!

హైదరాబాద్ లో హైడ్రా మెరుపు వేగంతో పనిచేస్తోంది. జోరువానలోనూ హైడ్రా చీఫ్ రంగనాధ్ ఆధ్వర్యంలో కూల్చివేతలు కొనసాగిస్తున్నారు అధికారులు. మాదాపూర్ ఈదులకుంట చెరువు రెవెన్యూ రికార్డుల నుంచి ఈ చెరువు మాయం అయిపోయిందంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ చెరువును పరిశీలించారు రంగనాధ్. 

New Update
Hydra Fastest Action: హైడ్రా పరుగులు.. మెరుపు వేగంతో కూల్చివేతలు!

Hydra Fastest Action: తెలంగాణాలో ఇప్పుడు అతిపెద్ద చర్చ హైడ్రా. నాలాలు.. చెరువులు.. ఆక్రమించుకుని అక్రమ నిర్మాణాలతో దందాలు చేస్తున్నవారికి కంటిమీద నిద్ర లేకుండా చేస్తోంది హైడ్రా. హైదరాబాద్ లో చెరువుల బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాలను ఒక్కోటిగా కూలుస్తూ వస్తున్నారు హైడ్రా అధికారులు. నోటీసు ఇవ్వడం.. దానికి సమాధానం ఇవ్వని వ్యక్తుల ప్రాపర్టీస్ నేల మట్టం చేస్తూ పోతున్నారు. ఈ క్రమంలో ఎవరినీ ఉపేక్షించడం లేదు. సెలబ్రిటీలు, రాజకీయనాయకులు, బడాబాబులు ఎవరికీ ఎటువంటి అవకాశం ఇవ్వడం లేదు. హైదరాబాద్ లో దాదాపుగా 60 శాతానికి పైగా చెరువులు కబ్జాలకు గురయ్యాయని హైడ్రా అంచనా వేసింది. ఈ మేరకు చెరువులలో ఆక్రమణలు తొలగించాలని గట్టిగ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటికే చాలా వరకూ చెరువుల ఆక్రమణలపై నోటీసులు ఇచ్చింది హైడ్రా. నోటీసులకు స్పందించని వారి కట్టడాలపై బుల్డోజర్ తో విరుచుకుపడి వాటిని నేల మట్టం చేస్తున్నారు అధికారులు. 

 Hydra Fastest Action: హైడ్రా కు పూర్తి స్థాయి అధికారాలు ఇస్తూ.. దానికి కమిషనర్ గా ఐపీఎస్ అధికారి రంగనాధ్ ను నియమించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెరువులు, నాలాల ఆక్రమణపై సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. రంగనాధ్ ఎక్కడా ఎటువంటి అవకాశం ఇవ్వడంలేదు. అందరినీ హడలెత్తిస్తున్నారు. బఫర్ జోన్ లో అక్రమంగా నిర్మించిన కట్టడాలపై మెరుపు వేగంతో దాడులు చేసి కూల్చివేస్తున్నారు. అవతలి వారికి కనీసం ఊపిరి తీసుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదు. జోరుగా వానలు పడుతున్నా హైడ్రా బుల్డోజర్లు ఆగడంలేదు. హైడ్రా చీఫ్ రంగనాధ్ విరామం తీసుకోవడం లేదు. 

Hydra Fastest Action: తాజాగా మాదాపూర్ ఈదులకుంట చెరువును పరిశీలించారు రంగనాధ్. ఈచెరువు గతంలో 6 ఎకరాలు ఉండేది. అయితే, ఇప్పుడు రెవెన్యూ రికార్డుల్లో చెరువు మాయం అయిపొయింది. ఈ ఈదులకుంట చెరువు మొత్తం విష్ణు బిల్డర్స్ యజమానులు కబ్జా చేశారని హైడ్రాకు శేరిలింగంపల్లి సీపీఎం నేత శోభన్ ఫిర్యాదు చేశారు. దీంతో ఈదులకుంట చెరువు ప్రాంతాన్ని హైడ్రా చీఫ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ చెరువులోకి వచ్చే నాలాను పునరుద్ధరిస్తామని రంగనాధ్ తెలిపారు. 

Hydra Fastest Action: ఇదిలా ఉంటె మదీనాగూడాలోని ఈర్ల చెరువు బఫర్ జోన్ లో మూడు ఇళ్లను నిర్మించారు. దీనిని పరిశీలించిన హైడ్రా అధికారులు ఆ మూడు ఇళ్లనూ కూల్చివేశారు. అదేవిధంగా అక్రమంగా భవనాలు నిర్మించినందుకు ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. అప్పట్లో నిబంధనలకు విరుద్ధంగా చందానగర్ GHMC డిప్యూటీ కమిషనర్ సుదామ్ష్‌ ఈ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినట్టు హైడ్రా అధికారులు తేల్చారు. సుదామ్ష్‌ తో పాటు HMDA సిటీ ప్లానర్‌ రాజ్‌కుమార్‌ కూడా ఈ విషయంలో సంబంధము ఉందని నిర్ధారించిన పోలీసులు  ఈ ఇద్దరు అధికారులపై కేసు నమోదు చేశారు. 

మొత్తంగా చూసుకుంటే హైడ్రా చీఫ్ రంగనాధ్ నేతృత్వంలో అధికారులు సిటీలోని చెరువుల కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నారు. వేగంగా చెరువులు, కుంటలు ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటూ ముందుకు సాగిపోతోంది హైడ్రా బుల్డోజర్!

Advertisment
Advertisment
తాజా కథనాలు