ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు, పార్కుల ఆక్రమణలను ఆపడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను తీసుకువచ్చిందని ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. కొన్ని చోట్ల పేదలను ముందు పెట్టి కొందరు భారీగా కబ్జాలను చేశారన్నారు. ఆర్టీవీకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏళ్లుగా నివాసాలు ఉంటున్న పేదల ఇళ్లను తొలగించే సమయంలో ప్రభుత్వం వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తుందన్నారు.
త్వరలోనే హైడ్రాకు పోలీస్ స్టేషన్ ను మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు. ఆక్రమణలు చేసి నిర్మాణాలు చేస్తే హైడ్రా చూస్తూ ఊరుకోదన్నారు. అలాంటి నిర్మాణాలను కూల్చివేయడం ఖాయమని తేల్చిచెప్పారు. ప్రజలు కూడా ఆస్తులు కొనే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లేకపోతే నష్టపోతారన్నారు. తర్వాత బాధపడినా ప్రయోజనం ఉండదన్నారు. రంగనాథ్ పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.