Actor Nagarjuna: హైడ్రా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మాదాపూర్‌లోని హీరో నాగార్జునకు చెందిన N-కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతకు సిద్ధమైంది. కూల్చివేతను హైడ్రా అధికారులు ప్రారంభించారు. మూడున్నర ఎకరాల చెరువు స్థలాన్ని N-కన్వెన్షన్ కబ్జా చేసినట్లు అధికారులు గుర్తించారు. తమ్మిడి హడ్డి చెరువు FTL, బఫర్ జోన్ పరిధిలో నాగార్జున N-కన్వెన్షన్ ఉంది. మొత్తం 29 ఎకరాల 24 గుంటలలో తమ్మిడి హడ్డి చెరువు ఉంది. ఇటీవలే N-కన్వెన్షన్ సెంటర్ కబ్జాలపై హైడ్రాకు ఫిర్యాదు అందింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే N-కన్వెన్షన్‌ను కూల్చివేస్తున్నారు.
పూర్తిగా చదవండి..BREAKING: హీరో నాగార్జునకు రేవంత్ సర్కార్ షాక్!
హీరో నాగార్జునకు రేవంత్ సర్కార్ షాక్ ఇచ్చింది. మాదాపూర్‌లోని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతను హైడ్రా అధికారులు ప్రారంభించారు. నాగార్జున తుమ్మిడి హడ్డి చెరువును కబ్జా చేసి బఫర్ జోన్లో కన్వెన్షన్‌ను నిర్మించారని ఫిర్యాదు రావడంతో అధికారులు కూల్చివేస్తున్నారు.
Translate this News: