CM Revanth Reddy: AI హబ్ గా హైదరాబాద్.. ఫ్యూచర్ సిటీ లోగో ఆవిష్కరించిన రేవంత్!

TG: ఏఐ అనేది నేటి తరం అద్భుత ఆవిష్కరణ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. AI హబ్‌గా హైదరాబాద్ ఉండబోతుందని చెప్పారు. కొత్త ఆవిష్కరణలు ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తాయన్నారు. విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్‌ మాదిరిగా ఏ నగరం సిద్ధంగా లేదని అన్నారు.

New Update
CM Revanth Reddy: AI హబ్ గా హైదరాబాద్.. ఫ్యూచర్ సిటీ లోగో ఆవిష్కరించిన రేవంత్!

CM Revanth Reddy: AI గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సాంకేతికత, ఆవిష్కరణ లేకుండా సమాజంలో ఏ మార్పు జరగదని ఆయన అన్నారు. మొదటి రైలు, ఇంజిన్ ఆవిష్కరణ తరువాత ప్రపంచం పూర్తిగా మారిందని.. విమానం ఆవిష్కరణతో ప్రపంచ స్వరూపమే మారిపోయిందని చెప్పారు. ఇదే క్రమంలో కరెంటు, బల్బు, టీవీ, కెమెరా, కంప్యూటర్ - ఇవన్నీ ప్రపంచ గతిని మార్చడంలో కీలక పాత్ర పోషించాయని అన్నారు.

టెలివిజన్, కంప్యూటర్లు, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ చూడటం మన తరం చేసుకున్న అదృష్టం అని పేర్కొన్నారు. ఇవాళ ప్రపంచ సాంకేతికరంగంలో వచ్చిన అత్యుత్తమ ఆవిష్కరణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అన్నారు. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడల్లా కొంత భయం నెలకొంటుందని.. అది మన జీవితాన్ని ఎలా మెరుగుపరుస్తుంది.. అదే సమయంలో ఉద్యోగాలు పోతాయా భయం ఉండటం సహజం అని చెప్పారు. దేశ చరిత్రను పరిశీలిస్తే.. గతంలో వచ్చిన పారిశ్రామిక విప్లవాన్ని సరిగ్గా అనుసరించలేకపోయాం అని అన్నారు.

భారతదేశ భవిష్యత్తు గురించి మనం ఆలోచిస్తే.. హైదరాబాద్‌ సిటీలా మారే సిటీ పరిశ్రమల ఏర్పాటుకు సంపూర్ణంగా సిద్ధంగా లేదని అన్నారు. ఇందుకు సంబంధించిన సవాళ్ళను స్వీకరించడమే కాదు... భవిష్యత్తును సృష్టిస్తాం అని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై తమ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం చాలా చర్యలు తమ ప్రభుత్వం తీసుకున్నట్లు తెలిపారు. ఈ రంగంలో మన భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటున్నాం అని పేర్కొన్నారు.

తెలంగాణ AI మిషన్, లేదా NASSCOM భాగస్వామ్యంతో T-AIM తెలంగాణలో AI ఫ్రేమ్‌వర్క్‌ను అమలు చేయడంలో తమకు సహకరిస్తాయని తెలిపారు. ఇండస్ట్రీ నిపుణులతో కలిసి ఆవిష్కరణలను ప్రభుత్వం ముందుకు తీసుకెళుతుందని అన్నారు. హైదరాబాద్ ను AI హబ్ గా తీర్చిదిద్దబోతున్నామనేందుకు ఈ సదస్సు నిదర్శనం అని చెప్పారు. సిటీ ఆఫ్ ది ఫ్యూచర్‌కి మీ అందరికి స్వాగతం అని అన్నారు. మనమందరం కలిసి ఫ్యూచర్ సిటీని ఒక గొప్ప AI హబ్ గా తీర్చిదిద్ధే సంకల్పంతో మీరంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు