Heavy Traffic in Hyderabad: ఏమైందీ ఈ భాగ్యనగరానికి.. ఎటు చూసినా ట్రాఫిక్ జామే.. బండి ముందుకు కదిలితే ఒట్టు.. దీనంతటికీ కారణం ఒకే ఒక్క బోర్డు. అవును.. పలు పెట్రోల్ బంకుల్లో దర్శనమిచ్చిన ఈ నో స్టాక్ బోర్డ్ నగర వ్యాప్తంగా ట్రాఫిక్ జామ్‌కు కారణమైంది. కేంద్ర ప్రభుత్వంకొత్త మోటారు వాహనాల చట్టం తీసుకువచ్చింది. దీని ప్రకారం.. ఎవరైనా ప్రమాదం చేసి పారిపోతే కఠిన శిక్ష పడనుంది. అయితే, ఈ చట్టాన్ని నిరస్తూ డ్రైవర్లు, ఆయిల్ ట్యాంకర్ యజమానులు ధర్నాకు దిగారు. దీంతో పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా పెట్రోల్ బంకుల్లో ఫ్యూయెల్ కొరత ఏర్పడింది. పలు చోట్ల నో స్టాక్ బోర్డులు పెట్టడంతో.. వాహనదారులు అంతా ఫ్యూయెల్ సెంటర్లకు బారులు తీరారు. పెట్రోల్, డీజిల్ కొట్టించుకోవడానికి వాహనదారులంతా రోడ్లపైకి వచ్చారు. దాంతో.. బంకుల వద్ద రద్దీ ఏర్పడటమే కాకుండా.. రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి.
ముఖ్యంగా హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రతి ఏరియాలో ఇదే పరిస్థితి నెలకొంది. డ్రైవర్స్ ధర్నా కారణంగా పెట్రోల్, డీజిల్ దొరకదేమో అన్న భయంతో ప్రజలు ఒక్కసారిగా ఫ్యూయెల్ సెంటర్లకు బారులుతీరారు. దీంతో అన్ని ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. అటు మియాపూర్ నుంచి ఇటు ఎల్బీనగర్ వరకు.. ఇటు మెహిదీపట్నం నుంచి అటు సికింద్రాబాద్ వరకు ఎక్కడ చూసినే ఇదే పరిస్థితి. బండి ముందుకు కదిలితే ఒట్టు అన్నట్లుగా ఉంది. గచ్చిబౌలి, ఐకియా జంక్షన్, కొండాపూర్ ఏరియాల్లోనైతే అడుగు తీసి అడుగు పెట్టలేని స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. అందుకే.. ఆయా రూట్లలో వాహనదారులు బయటకు రావొద్దని సూచిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.
టెన్షన్ వద్దు.. ధర్నా విరమించారు..
పెట్రోల్, డీజిల్ దొరకదన్న కంగారు అవసరం లేదు. ఆయిల్ ట్యాంకర్ల యజమానులు ధర్నా విరమించేశారు. HP,BPC,IOC ఆయిల్ కంపెనీలలో పెట్రోల్, డీజిల్ నింపుకొని బంకులకు బయల్దేరాయి ట్యాంకర్లు. ఇప్పటికే ట్యాంకర్లు బంకులను చేరేందుకు సిద్ధంగా ఉన్నాయి. రాత్రి వరకు అన్ని బంకుల్లో పెట్రోల్, డీజిల్ ఫుల్ స్టాక్ ఉండనుంది. వాహనదారులు కంగారు పడొద్దని పోలీసులు సూచించారు.
Also Read:
అదే పనిచేసి ఉంటే అమ్మాయిపై అఘాయిత్యం జరిగేదా? అనిత సంచలన కామెంట్స్..