Hyderabad Traffic : తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. నేడు ఆ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు!

తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా నగరంలో ఈరోజు ట్యాంక్‌బండ్‌, పరేడ్‌ గ్రౌండ్‌ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని సీపీ శ్రీనివాస్‌ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం రాత్రి నుంచే హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను అమలులోనికి తీసుకుని వచ్చారు.

New Update
Traffic Restrictions : నేడు బక్రీద్‌..హైదరాబాద్‌ లో ఈ ఏరియాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు!

Telangana : తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకల (Telangana Formation Day) సందర్భంగా నగరంలో ఈరోజు ట్యాంక్‌బండ్‌, పరేడ్‌ గ్రౌండ్‌ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని (Traffic Restrictions) సీపీ శ్రీనివాస్‌ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పరేడ్‌గ్రౌండ్‌ పరిసరాల్లో ఆదివారం ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటవరకు , ట్యాంక్‌బండ్‌పై ఆదివారం రాత్రి 12 గంటల వరకు, గన్‌పార్క్‌ వద్ద ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 10గంటల వరకు, వాహనాల రాకపోకలపై ఆంక్షలుంటాయని వివరించారు.

శనివారం రాత్రి నుంచే హైదరాబాద్ (Hyderabad) లోని కొన్ని ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను అమలులోనికి తీసుకుని వచ్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఆదివారం ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయని సీపీ వివరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళుర్పిస్తారు. ఈ సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి పది గంటల వరకూ గన్ పార్క్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.

అలాగే ఆదివారం ఉదయం 9 గంటల నుంచి పది గంటల వరకూ పరేడ్ గ్రౌండ్ (Parade Ground) ప్రాంతాల్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్నాయని పోలీసులు వివరించారు. అలాగే వివిధ కార్యక్రమాలు ఉన్నందున ట్యాంక్ బండ్ పై రాత్రి పన్నెండు గంటల వరకూ వాహనాల రాకపోకలపై నిషేధాజ్ఞలు ఉంటాయని ఈ విషయాలను గమనించి ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని పోలీసులు తెలిపారు.

Also read: ఏపీలో దారుణం.. డబ్బులు అడిగాడని కొడుకుని కాల్చి చంపిన ఏఆర్‌ కానిస్టేబుల్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు