రంజామ్ మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా హలీమ్ స్టాల్స్ కనిపిస్తాయి. సాయంత్రం దాటిన తర్వాత హలీమ్ తినేందుకు ప్రజలు క్యూ కడతారు. హలీమ్ షాపులన్ని కస్టమర్లతో కిక్కిరిసిపోయి ఉంటాయి. అంతా పండుగ వాతావరణమే కనిపిస్తుంది. అయితే కొన్నిసార్లు మాత్రం ఈ షాపులు గొడవలకు అడ్డాగా మారుతాయి. తాజాగా మరోసారి అదే జరిగింది.
చితకబాదిన ఓనర్స్:
హైదరాబాద్ ముషీరాబాద్‌లోని 4 చిల్లీస్ కిచెన్ వద్ద పెద్ద ఎత్తున గొడవ జరిగింది. హలీమ్ తిన్న ఓ కస్టమర్ ఆన్‌లైన్ మోడ్‌లో డబ్బులు చెల్లించాడు. అయితే అది షాపు సిస్టమ్‌కు మాత్రం చెల్లింపు జరిగినట్టు చూపించలేదు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాదన జరిగింది. తర్వాత మాటామాటా పెరిగింది. దీంతో ఒకరిపైఒకరు చెయ్యి చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇదంతా గమనిస్తున్న తోటి హలీమ్ షావు ఓవర్లు ఒక్కసారిగా ఘటనా స్థాలానికి చేరుకున్నారు. డబ్బు చెల్లించలేదంటూ కస్టమర్‌ను ఇష్టారీతిన చావబాదారు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు వీడియో రికార్డ్ చేశారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
గొడవంతా ప్రధాన రహదారిపైనే జరగడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక ఇటివలీ కాలంలో ఈ తరహా ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని ట్విట్టర్‌లో నెటిజన్లు ఆరోపిస్తున్నారు.
Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు అడిషనల్ ఎస్పీలు సస్పెండ్