Viral Video: హలీమ్ పేమెంట్ విషయంలో రచ్చ.. కస్టమర్‌ని ఎలా చితకబాదారో చూడండి! హైదరాబాద్ ముషీరాబాద్‌లోని ఓ హలీమ్ షాప్ వద్ద పెద్ద గొడవ జరిగింది. హలీమ్ తిన్న ఓ కస్టమర్ ఆన్‌లైన్ డబ్బులు చెల్లించాడు. అయితే అది షాప్ అతని సిస్టమ్‌లో రిఫ్లెక్ట్‌కాలేదు. దీంతో మాటామాటా పెరిగి చివరకు హలీమ్ ఓవర్లంతా కలిసి కస్టమర్‌ను చితకబాదారు. By Trinath 30 Mar 2024 in Latest News In Telugu వైరల్ New Update షేర్ చేయండి రంజామ్ మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా హలీమ్ స్టాల్స్ కనిపిస్తాయి. సాయంత్రం దాటిన తర్వాత హలీమ్ తినేందుకు ప్రజలు క్యూ కడతారు. హలీమ్ షాపులన్ని కస్టమర్లతో కిక్కిరిసిపోయి ఉంటాయి. అంతా పండుగ వాతావరణమే కనిపిస్తుంది. అయితే కొన్నిసార్లు మాత్రం ఈ షాపులు గొడవలకు అడ్డాగా మారుతాయి. తాజాగా మరోసారి అదే జరిగింది. చితకబాదిన ఓనర్స్: హైదరాబాద్ ముషీరాబాద్‌లోని 4 చిల్లీస్ కిచెన్ వద్ద పెద్ద ఎత్తున గొడవ జరిగింది. హలీమ్ తిన్న ఓ కస్టమర్ ఆన్‌లైన్ మోడ్‌లో డబ్బులు చెల్లించాడు. అయితే అది షాపు సిస్టమ్‌కు మాత్రం చెల్లింపు జరిగినట్టు చూపించలేదు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాదన జరిగింది. తర్వాత మాటామాటా పెరిగింది. దీంతో ఒకరిపైఒకరు చెయ్యి చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇదంతా గమనిస్తున్న తోటి హలీమ్ షావు ఓవర్లు ఒక్కసారిగా ఘటనా స్థాలానికి చేరుకున్నారు. డబ్బు చెల్లించలేదంటూ కస్టమర్‌ను ఇష్టారీతిన చావబాదారు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు వీడియో రికార్డ్ చేశారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. #Hyderabad—Street fight at 4 Chillies Hotel, Musheerabad last night. The fight lasted for 10 minutes, leaving locals terrified. This incident caused a traffic jam on the main road. The dispute originated from the sale of haleem by the customer and a payment disagreement. The… pic.twitter.com/5rs21dIDpa — NewsMeter (@NewsMeter_In) March 30, 2024 గొడవంతా ప్రధాన రహదారిపైనే జరగడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక ఇటివలీ కాలంలో ఈ తరహా ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని ట్విట్టర్‌లో నెటిజన్లు ఆరోపిస్తున్నారు. Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు అడిషనల్ ఎస్పీలు సస్పెండ్ #hyderabad #haleem మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి