Street Dogs Attack on Children: వీధి కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు అందరిపైనా దాడులకు తెగబడుతున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు కనిపిస్తే చాలు వీరంగం చేస్తున్నాయి. తాజాగా, దిల్ సుక్ నగర్ లో ఓ విధి కుక్క చిన్నారులను వెంబడించింది. భయంతో ఆ చిన్నారులు వెంటనే పరుగులు తీశారు. అయినా, చిన్నారుల వెంట పడి మరి ఓ బాలుడిపై దాడి చేసింది. బాలుడి కేకలు విన్న స్థానికులు కుక్కను తరిమి కొట్టారు. అక్కడే ఉన్న ఓ మహిళ పరిగెత్తుకుంటూ వచ్చి బాలుడిని రక్షించింది.
ఇదిలా ఉండగా, మేడ్చల్ జిల్లా నిజాంపేటలోనూ ఓ చిన్నారిపై వీధికుక్క దాడి చేసింది. బండారి లేఅవుట్‌లోని పార్కులో ఆడుకుంటున్న ఓ చిన్నారిపై విరుచుకుపడింది. రెండేళ్ల చిన్నారి మెడను కరిచింది. అనంతరం వీధి కుక్క తన నోటితో ఆ చిన్నారిని పక్కకు లాక్కెళ్లిందుకు ప్రయత్నించింది. చిన్నారి అరుపులు విన్న స్ధానికులు వెంటనే అప్రమత్తమైయ్యారు. కుక్కను వెంబడించి తరిమి కొట్టారు. దీంతో చిన్నారికి పెద్ద ప్రమాదం తప్పింది. దాడిలో గాయపడిన చిన్నారిని చికిత్స నమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Also Read: మావోయిస్టులకు బిగ్ షాక్.. ఎన్‌కౌంటర్‌లో హిడ్మా హతం..?
కాగా, వీధి కుక్కల దాడులపై ప్రజలు భయందోళన చెందుతున్నారు. చిన్నారులను ఆడుకోడానికి పంపించాలన్న కుక్కల దాడికి ఇబ్బంది కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి వీధి కుక్కలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.