Hyderabad: 161 కి.మీ, 11 టోల్‌ప్లాజాలు.. రీజినల్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టు హైలెట్స్ ఇవే!

హైదరాబాద్ చుట్టూ నిర్మించబోయే రీజినల్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. ఆగస్టులో ఈ రోడ్డు నిర్మాణం టెండర్లు వేయనుండగా రోడ్డు మ్యాప్ ఫైనల్ చేశారు అధికారులు. 6 ప్యాకేజీలతో 161 కి.మీ, 11 టోల్‌ప్లాజాలు, 11 ఇంటర్‌ ఛేంజ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Hyderabad: 161 కి.మీ, 11 టోల్‌ప్లాజాలు.. రీజినల్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టు హైలెట్స్ ఇవే!
New Update

Hyderabad Regional Ring Road: హైదరాబాద్ మహానగరం చుట్టూ నిర్మించబోయే (ఆర్ఆర్ఆర్) రీజినల్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు పడింది. ఆగస్టులో ఈ రోడ్డు నిర్మాణం టెండర్లు వేయనుండగా రోడ్డు మ్యాప్ ఫైనల్ చేశారు. 6 ప్యాకేజీలతో 161 కి.మీ. 11 టోల్‌ప్లాజాలు, 11 ఇంటర్‌ ఛేంజ్‌లు ఏర్పాటు చేయనున్నారు.

ప్రాథమిక అంచనాలతో రోడ్డు మ్యాప్‌..

ఈ మేరకు హైదరాబాద్ చుట్టూ నార్త్ సైడ్ రోడ్డులో టోల్‌ ప్లాజాలు, ఆర్వోబీల వరకు ఏయే నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందనే అంశాలపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(NHAI) తెలంగాణ విభాగం ప్రాథమికంగా ఖరారు చేసింది. అంతేకాదు ప్రాథమిక అంచనాలలో త్వరలోనే రోడ్డు మ్యాప్‌ ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణంలో చాలా ఆలస్యమైన నేపథ్యంలో కాంగ్రెస్‌ సర్కార్ రీజినల్‌ రింగ్‌ రోడ్డుపై ప్రత్యేక దృష్టి పెడుతోంది. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడే ఔటర్‌ రింగ్‌ రోడ్డును నిర్మించాం. ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌ను కూడా తమ ప్రభుత్వంలోనే పూర్తిచేస్తామని సీఎం రేవంత్‌ (CM Revanth Reddy), మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెబుతున్నారు. రోడ్డు మ్యాప్‌కు సంబంధించిన ఇతర నిర్మాణాలపైనా ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో సమీక్షిస్తున్నారు.

ఇది కూడా చదవండి: IPL Winner 2024: తెరపై ఒకరు తెరవెనక మరొకరు.. కేకేఆర్ విజయంలో వీరిద్దరిదే కీలకపాత్ర !

ఎన్‌హెచ్‌ఏఐ రిపోర్టు సిద్ధం..

ఇందులో భాగంగానే నార్త్ సైడ్ రోడ్డు విస్తీర్ణం 161కి.మీ. నిర్మించనుండగా.. 11 టోల్‌ప్లాజాలు, 11 ఇంటర్‌ ఛేంజ్‌లు రానుండగా, 6 చోట్ల రెస్ట్‌ ఏరియాలు ఏర్పాటుకానున్నాయి. ఈ మార్గంలో పలు జాతీయ, రాష్ట్ర రహదారులను దాటాల్సివస్తుందని, కొన్నిచోట్ల ఇరిగేషన్‌ శాఖకు సంబంధించిన మైనర్‌, మేజర్‌, బాక్స్‌ కల్వర్టులను కూడా నిర్మించాలని అధికారులు పేర్కొన్నారు. నాలుగు రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జి(ఆర్వోబీ)లను నిర్మించాల్సి ఉంటుందని, దీనిపై ఎన్‌హెచ్‌ఏఐ ప్రాథమికంగా ఒక రిపోర్టును సిద్ధం చేసింది. రోడ్డు విస్తీర్ణంలో చిన్న, మధ్య, భారీ తరహా వెహికల్‌ అండర్‌ పాస్‌లు అన్నీ కలిపి దాదాపు 187 వరకు నిర్మాణం చేయాల్సి వస్తోందని అధికారులు వెల్లడించారు. మేజర్‌ బ్రిడ్జిలు 27, మైనర్‌ బ్రిడ్జిలు 80, బాక్స్‌ కల్వర్టులు 404 మేర నిర్మించాల్సి ఉంటుందని. ఈ నిర్మాణాలకు రోడ్డుతో సంబంధం లేకుండా టెండర్లకు వెళ్లాలా? లేక రోడ్డుతో పాటే టెండర్లను ఆహ్వానించాలనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మార్గంలో ఉన్న రైల్వే లైన్లు, కాల్వలు, చెట్లు, సహా పలు అంశాలకు సంబంధించిన వివరాలను రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖకు అందించారు. ఇరిగేషన్‌, రైల్వే శాఖల నుంచి పర్మిషన్ రావాల్సి ఉంది.

#hyderabad #regional-ring-road
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe