Hyderabad: జాబ్ ఉండాలంటే వారికి కిస్ చెయ్యాల్సిందే..! హైదరాబాద్ నడిబొడ్డు సంచలన వ్యవహారం గుట్టు రట్టు అయ్యింది. నిత్యం వేలాది మంది సంచరించే ఆ ప్రాంతంలో స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాకు చెక్ పెట్టారు పోలీసులు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పంజాగుట్ట పోలీసులు.. క్లౌడ్ 9 స్పా సెంటర్ పై దాడి చేసి.. ముఠా ఆట కట్టించారు. స్పా సెంటర్ నిర్వాహకులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By Shiva.K 31 Oct 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Prostitution Racket in Hyderabad: స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో హైదరాబాద్ నడిబొడ్డున అమీర్‌పేటలో జరుగుతున్న ఈ తతంగం వెలుగు చూసింది. స్పా ముసుగులో నిర్వాహకులు ఎంతోమంది అమాయక యువతులను వ్యభిచార కూపంలోకి నెడుతున్నారని తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. అమీర్‌పేటలోని క్లౌడ్ 9 స్పా సెంటర్ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. స్పా సెంటర్లో బలవంతంగా పని చేస్తు యువతులకు విముక్తిని కల్పించాడు. ఈ స్పా సెంటర్ వ్యవహారాన్ని బయటపెట్టిన బాధితురాలు.. నిర్వాహకుల అరాచకాలు ఎంత దారుణంగా ఉంటాయో వెల్లడించింది. బాధిత యువతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 'లక్షల్లో జీతం ఇస్తామంటూ అమాయక యువతులకు ఆశ చూపి.. వ్యభిచార కూపంలోకి దించుతున్నారు. ఉద్యోగంలోకి చేరాక.. కస్టమర్ల కోర్కెలు తీర్చాలంటూ స్పాసెంటర్ నిర్వహకుల ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఉద్యోగంలో ఉండాలంటే ముద్దులివ్వాల్సిందేనంటూ నిర్వహకుల ఒత్తిడి చేస్తారు. బాడీ టు బాడీ, న్యూడ్ మసాజ్‌లు చేయాలంటూ బలవంతం చేస్తారు. ఒకవేళ వారు చెప్పినట్లు చేయకపోతే.. ఇంట్లో వ్యభిచారం చేస్తున్నావని చెబుతామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. వ్యభిచారిని అని బయట ప్రచారం చేస్తామంటూ స్పా సెంటర్ నిర్వాహకులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మూడు నెలలుగా జీతం ఇవ్వడం లేదు. కస్టమర్ల కోర్కెలు తీరిస్తేనే జీతం ఇస్తామంటూ వేధింపులకు పాల్పడ్డారు.' అని సంచలన వివరాలను వెల్లడించింది. స్పా సెంటర్ నిర్వాహకుల వేధింపులు ఎక్కువ కావడంతో పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు.. స్పా సెంటర్ నిర్వహకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్పా సెంటర్లో బంధీలుగా ఉన్న యువతులకు విముక్తి కల్పించారు. Also Read: శరీరంలో గాయం మచ్చ పోవట్లేదా? జస్ట్ ఇలా చేస్తే చాలు మరక మాయం..! ఈ రాశుల వారు వారం రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే కష్టాలు తప్పవు..! #hyderabad #prostitution-racket-in-hyderabad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి