/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Hyderabad-Politics--jpg.webp)
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. ముఖ్యంగా బీజేపీ అభ్యర్థి మాధవీలత, ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. శ్రీ రామనవమి రోజు మాధవీలత వ్యవహారంతో ఓల్డ్ సిటీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఆ రోజు నిర్వహించిన ర్యాలీలో మసీదును టార్గెట్ చేస్తూ బాణం ఎక్కు పెట్టి మాధవీలత ఫోజు ఇచ్చారు. దీంతో మాధవీలత చర్యలపై అసదుద్దీన్ ఓవైసీ సీరియస్ అయ్యారు. మాధవీలత తీరు ఈసీ, పోలీసులకు కనిపించదా? అంటూ ఓవైసీ సీరియస్ అయ్యారు.
ఇది కూడా చదవండి:CM Revanth Reddy: కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్
హైదరాబాద్ ఎంపీ సీటు ఎంఐఎం కు కంచుకోటగా ఉన్న విషయం తెలిసిందే. ఎంత మంది అభ్యర్థులు పోటీ పడ్డా.. అక్కడ ఎంఐఎం అభ్యర్థి ఏళ్లుగా సునాయసంగా విజయం సాధిస్తున్నారు. ఇతర పార్టీల అభ్యర్థులు నామ మాత్రంగా ప్రచారం చేసేవారు. అయితే.. ఈ సారి బీజేపీ మాధవీలతకు అవకాశం ఇచ్చింది. తన గెలుపు ఖాయమంటూ.. మాధవీలత ఓల్డ్ సిటీలో ప్రచారం చేస్తున్నారు. సున్నితమైన ప్రాంతం కావడంతో కేంద్ర హోం శాఖ ఆమెకు వై ప్లస్ సెక్యూరిటీని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఓవైసీ, ఎంఐఎం టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తూ ప్రచారం సాగిస్తున్నారు మాధవీలత. మాధవీలత ఎంట్రీతో ఎంఐఎం సైతం సీరియస్ గా ప్రచారం సాగిస్తోంది. మాధవీలతకు కౌంటర్ గా విమర్శల దాడి ప్రారంభించింది. అయితే.. కాంగ్రెస్ పార్టీ ఇంకా హైదరాబాద్ లోక్ సభ స్థానానికి అభ్యర్థిని ప్రకటించలేదు.