Miyapur Incident: పోలీసులపై దాడి.. మియాపూర్‌లో 144 సెక్షన్ అమలు

TG: మియాపూర్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో 144సెక్షన్ విధించారు పోలీసులు. ఈరోజు నుంచి 29వ తేదీ వరకు 144సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. 144 సెక్షన్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ అవినాష్ మహంతి హెచ్చరించారు. వివాదాస్పద ల్యాండ్‌లో పోలీసులు డ్రోన్‌తో గస్తీ కాస్తున్నారు.

Miyapur Incident: పోలీసులపై దాడి.. మియాపూర్‌లో 144 సెక్షన్ అమలు
New Update

Miyapur Incident: మియాపూర్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో 144సెక్షన్ విధించారు పోలీసులు. ఈరోజు నుంచి 29వ తేదీ వరకు 144సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. 144 సెక్షన్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ అవినాష్ మహంతి హెచ్చరించారు. మియాపూర్ హెచ్ఎండిఏ వివాదాస్పద ల్యాండ్‌లో పోలీసులు డ్రోన్‌తో గస్తీ కాస్తున్నారు. కాగా మియాపూర్ ప్రభుత్వ భూముల పై తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేశారు.

సంగీత, సీత అనే మహిళ చాలామంది మహిళలను రెచ్చగొట్టారని.. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుందామని రెచ్చగొట్టిన సంగీత.. స్థానిక ఫంక్షన్ హాల్స్ లో మీటింగ్ ఏర్పాటు చేసి రెచ్చగొట్టేలా స్పీచ్ లు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. మొత్తం పది మంది పై కేసులు నమోదు చేశారు పోలీసులు. సంగీత, సీత, సంతోష్ తోపాటు మరో ఏడుగురి పై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం పరారీ లో ఉన్న నిందితుల కోసం పోలీసుల గాలింపు చర్యలు మొదలు పెట్టారు. ప్రభుత్వ భూముల్లో పాగా వేసి పోలీసుల పై రాళ్లు రువ్విన వారిపై కూడా కేసులు నమోదు చేశారు.

#miyapur-incident
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe