Hyderabad Drugs Case: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. న్యూఇయర్ వేడుకల కోసం పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకువచ్చిన నిందితులను పట్టుకున్నారు యాంటీ నార్కోటిక్ పోలీసులు. పంజాబ్ నుంచి డ్రగ్స్ తీసుకువచ్చినట్లు గుర్తించారు పోలీసులు. పంజాబ్‌లోని లవ్లీ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థి సూరి లీల నవీన్, వీర సాయి తేజలు అక్కడి నుంచి డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. న్యూఇయర్ వేడుకల్లో విక్రయించేందుకు సిద్ధమయ్యారు. అయితే, పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. డ్రగ్స్ విక్రయిస్తున్న నవీన్, సాయి తేజను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 100 గ్రాముల ఎండీఎంఏ, 26 గ్రాముల కొకైన్, 29 గ్రాముల బ్రౌన్ షుగర్‌ను సీజ్ చేశారు పోలీసులు. కాగా, వీరిద్దరూ లోన్ యాప్‌లలో భారీగా అప్పులు తీసుకున్నారు. ఈ అప్పులు తీర్చేందుకు తప్పుడు దారిని ఎంచుకున్నారు నవీన్, సాయి. న్యూఇయర్ వేడుకల్లో డ్రగ్స్ విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బుతో తమ అప్పులు తీర్చోవాలని భావించారు నవీన్, సాయి.
అయితే, వీరి ప్లాన్ అట్టర్‌ప్లాప్ అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటైన తరువాత డ్రగ్స్ ఫ్రీ తెలంగాణగా మారుస్తామని శపథం చేశారు. డ్రగ్స్ మహమ్మారి కారణంగా ఎంతో మంది జీవితాలు నాశనం అవుతున్నాయని, ఇక ఈ విషయంలో ఊపేక్షించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆమేరకు ప్రత్యేక వింగ్‌ను కూడా ఏర్పాటు చేశారు. న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో డ్రగ్స్ విక్రయాలు, డ్రగ్స్ అక్రమ రవాణా జరిగే అవకాశం ఉండటంతో.. అలర్ట్ అయ్యారు పోలీసులు. ఎక్కడికక్కడ చెకింగ్స్ నిర్వహిస్తున్నారు. డేగ కళ్లతో డ్రగ్స్‌పై వేట సాగిస్తున్నారు. ఎవరు దొరికితే వారిని తీసుకెళ్లి జైల్లో పడేస్తున్నారు. కాగా, తాజాగా పట్టుబడిన డ్రగ్స్‌లో తొలిసారి బ్రౌన్ షుగర్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
Also Read: