Hyderabad Metro Services: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ చెబుతూ మెట్రో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రైలు వేళల్లో అధికారులు మార్పు చేశారు. ఇప్పటి వరకు రాత్రి 11 గంటలకు చివరి రైలు ఉండగా.. ఇక నుంచి 11.45 గంటలకు చివరి రైలు అందుబాటులో ఉండనున్నట్లు పేర్కొంది. అలాగే ప్రతి సోమవారం ఉదయం 5.30గంటలకే మెట్రో రాకపోకలు మొదలు కానున్నట్లు తెలిపింది. మిగతా రోజుల్లో సాధారణంగానే ఉదయం 6గంటల నుంచే మెట్రో పరుగులు పెట్టనున్నట్లు పేర్కొంది. ఇటీవల రద్దీ పెరిగిన దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో వేళల్లో మార్పులు చేసినట్టు సమాచారం. పొడిగించిన వేళలు శుక్రవారం రాత్రి నుంచి అమల్లోకి వచ్చాయని మెట్రో అధికారులు తెలిపారు.
పూర్తిగా చదవండి..Hyderabad Metro: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ చెప్పిన మెట్రో.. ఇకపై!
హైదరాబాద్ వాసులకు మెట్రో సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. మెట్రో రైలు వేళల్లో మార్పులు చేసింది. ఇక నుంచి రాత్రి 11.45 గంటలకు చివరి రైలు అందుబాటులో ఉండనున్నట్లు పేర్కొంది. అలాగే ప్రతి సోమవారం ఉదయం 5.30గంటలకే మెట్రో రాకపోకలు మొదలు కానున్నట్లు తెలిపింది.
Translate this News: