/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Mangalahal-fire-accident-jpg.webp)
గోదాంలో మంటలు..
హైదారబాద్‌లోని మంగలహాట్ (Mangalahat) పోలీసుస్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం జరిగింది. గంగబోలి (Gangaboli) వద్ద ఉన్న ఓ ఫర్నీచర్ షాపు ( A furniture shop)లో తెల్లవారుజామున మంటలంటుకున్నాయి. గోదాం నుండి మంటలు, పొగ రావడంతో స్థానికులు గమనించి.. మంగలహాట్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదానికి కారణం తెలియడం లేదని పోలీసులు, యజమాని (Police, owner) తెలిపారు. సుమారు రూ. 3 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉండవచని ఉన్నతాధికారులు తెలిపారు. యజమాని ఫిర్యాదుతో పోలీసులు అనుమానాస్పద అగ్నిప్రమాదంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
వరస ప్రమాదాలు..
గత రెండు రోజుల క్రితం నగరంలోని హబ్సిగూడ (Habsiguda) లో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఓ కాంప్లెక్స్‌లోని 2,3వ అంతస్తుల్లో ఉన్న ఓ వస్త్ర దుకాణం, రెస్టారెంట్ (Restaurant)లో ఈ ఘటన షార్ట్‌సర్క్యూట్ (Short circuit) కారణంగానే చోటుచేసుకుంది. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. 10 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. ముందు జాగ్రత్తగా సమీపంలోని పెట్రోల్ బంకును పోలీసులు మూసివేయించారు. మరోవైపు అగ్నిప్రమాదం జరిగిన దుకాణాల అద్దాలను జీహెచ్‌ఎంసీ సిబ్బంది (GHMC staff) తొలగించారు. మంటలు అదుపులోకి తీసుకొచ్చినా ఇంకా దట్టంగా పొగలు రావటంతో స్థానికుల్లో కొంత ఆందోళన నెలకొంది. అగ్నిప్రమాదం నేపథ్యంలో ఉప్పల్-హబ్సిగూడ ( Uppal-Habsiguda) మార్గంలో ట్రాఫిక్‌జామ్ (Traffic jam ) ఏర్పడింది. ఇలా వరస ఆగ్ని ప్రమాదాలు నగరం నడి బొడ్డున జరగటంతో నగర వాసులు భయ పడుతున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవటంతో అంతా ఊపిరి పిల్చుకున్నారు.
Follow Us