Crime News: భార్య ఇంట్లో లేని సమయంలో హత్య.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రవికుమార్‌ మృతిపై అనుమానాలు..!

హైదరాబాద్ మధురానగర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రవికుమార్‌ హత్యపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖానికి మాస్క్, టోపీ ధరించిన యువకుడు.. అపార్ట్ మెంట్ లోకి వచ్చి వెళ్లిన దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. కుటుంబంలో తగాదాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Crime News: భార్య ఇంట్లో లేని సమయంలో హత్య.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రవికుమార్‌ మృతిపై అనుమానాలు..!
New Update

Software Employee Death Issue: హైదరాబాద్ మధురానగర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రవికుమార్‌ హత్యపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టారు. కుటుంబంలో తగాదాలు ఏమైనా ఉన్నాయా? భార్య పాత్ర ఏమైనా ఉందా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు.

Also Read: గుడివాడ గడ్డ అతనిదే.. ఎన్నికల ప్రచారమే అవసరం లేదు.. శ్యామల సంచలన వ్యాఖ్యలు..!

నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో కూతుర్ని తీసుకొని పార్క్ కు వెళ్లింది రవికుమార్ భార్య. తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి రవికుమార్ విగత జీవిగా పడి ఉన్నాడు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు.

Also Read: నెల్లూరులో రచ్చ..రచ్చ…పిడిగుద్దులు గుద్దుకున్న తెలుగు తమ్ముళ్లు..!

ముఖానికి మాస్క్, టోపీ ధరించిన ఓ యువకుడు..అపార్ట్ మెంట్ లోకి వచ్చి వెళ్లిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. భార్య ఇంట్లో లేని సమయంలో హత్య జరగడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుండగుడు ఇంట్లోకి చొరబడి హత్య చేసి ఆధారాలు లేకుండా చేసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. డెడ్‌బాడీపై పసుపు, కారం చల్లి పరారైయ్యాడు.

#hyderabad
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి