/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/kokapeta-jpg.webp)
హైదరాబాద్ కోకాపేట (Kokapet) లో రెండో విడత భూముల వేలం కొనసాగుతుంది. నిధుల సమీకరణ కోసం హెచ్ఎండిఏ(hmda)మరోసారి భూముల అమ్మక ప్రక్రియను చేపట్టింది. అత్యంత ధర ఉన్న కోకాపేట్‌లోని నియో పోలీస్ లే అవుట్‌లోని మొత్తం 45.33 ఎకరాల భూమి అమ్మకానికి పెట్టింది. ఈ నేపథ్యంలో కోకాపేట భూములు రికార్డు ధరలు పలికాయి. అత్యధికంగా ఎకరం భూమి రూ. 72.25 కోట్లు పలకగా.. అత్యల్పంగా 51.75 కోట్లు పలికింది. ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధర రూ.35 కోట్లు.
మొదటి విడతలో 26.86 ఎకరాలు వేలం వేయగా.. నాలుగు ఫ్లాట్లు రూ.1532.5 కోట్లు పలికాయి. అమ్మకానికి పెట్టిన కోకాపేట(Kokapet) నియో పోలీస్ లేఔట్‌లోని ప్లాట్ నెంబర్ 6లో 7 ఎకరాలు, ప్లాట్ నెంబర్ 7లో 6.55 ఎకరాలు, ప్లాట్ నెంబర్ 8లో 0.21 ఎకరాలు, ఫ్లాట్ నెంబర్ 9 లో 3.60 ఎకరాలు, ప్లాట్ నెంబర్ 10లో 3.60 ఎకరాలు, ఫ్లాట్ నెంబర్ 11లో 7.53 ఎకరాలు, నాట్ నెంబర్ 14లో 7.34 ఎకరాలతో కలిపి మొత్తం 45.33 ఎకరాల భూమిని విక్రయిస్తోంది.
గతంలో 2021 జూలైలో నియోపోలిస్ ఫేజ్ 1 వేలంలో అత్యధికంగా ఎకరం ధర రూ. 60 కోట్లను తాకింది. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 2 వేల కోట్లు సంపాదించింది. ఫేజ్ 1లో దాదాపు 49 ఎకరాలు విక్రయించగా.. ఎకరం అప్‌సెట్ ధరను 25 కోట్లుగా నిర్ణయించారు. అయితే ఈరోజు జరిగే వేలం ద్వారా మరో రూ. 2,000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇక, నియో పొలిస్‌తోపాటు గోల్డెన్ మైల్ పేరుతో అభివృద్ధి చేసిన లేఅవుట్లలో భూములు కొనుగోలుకు విపరీతమైన పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే.